China Ambassador:సీతారాం ఏచూరికి నివాళులర్పించిన చైనా రాయబారి
వామపక్ష నేత,సీపీఐఎం(CPIM) పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి(Sitaram Yechury) గత కొన్ని రోజులుగా ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్‌తో పడుతూ ఈ నెల 12న తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే.
దిశ, వెబ్‌డెస్క్:వామపక్ష నేత,సీపీఐఎం(CPIM) పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి(Sitaram Yechury) గత కొన్ని రోజులుగా ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్‌తో పడుతూ ఈ నెల 12న తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో భారత్(India) లోని చైనా రాయబారి(China Ambassador) జు ఫీహాంగ్(Xu Fiehong) శనివారం ఏచూరి భౌతికాయానికి శ్రద్ధాంజలి ఘటించారు.ఏచూరి పార్థివ దేహంపై పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు.అనంతరం కుటుంబ సభ్యులతో మాట్లాడి వారిని ఓదార్చారు.
మరోవైపు ఏచూరికి నివాళులర్పించిన వారిలో పాలస్తీనా రాయబారి(Palestine Ambassador) అద్నాన్ అబు అల్-హైజా(Adnan Abu Alhaijaa)కూడా ఉన్నారు.ఈ సందర్భంగా అద్నాన్ అబు అల్-హైజా శనివారం మీడియాతో మాట్లాడుతూ.. పాలస్తీనా యొక్క గొప్ప మద్దతుదారుని కోల్పోవడం చాలా బాధాకరంగా ఉందని, అతను నిత్యం పేదల కోసం పోరాడిన వ్యక్తని వెల్లడించారు.అలాగే పాలస్తీనా వాదానికి మద్దతుగా తామిద్దరం కలిసి చాలా కార్యక్రమాల్లో పాల్గొన్నామని అల్-హైజా తెలిపారు.