Breaking : ఇటలీలో తీవ్ర విషాదం.. నౌక మునిగిపోయి ఒకరు మృతి, పలువురు గల్లంతు.. !

ఇటలీలోని సిసిలియన్ రాజధాని పలెర్మో తీరంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.

Update: 2024-08-19 19:27 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఇటలీలోని సిసిలియన్ రాజధాని పలెర్మో తీరంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. తుఫాన్ కారణంగా ఒక విలాసవంతమైన పడవ నీటిలో మునిగిపోయింది.పడవ మునిగిపోవడంతో అందులో ఉన్న ఆరుగురు వ్యక్తులు తప్పిపోయారని అలాగే ఒకరు మరణించారని ఇటాలియన్ మీడియా తెలిపింది. ప్రమాదం జరిగిన వెంటనే ఇటలీ కోస్ట్ గార్డ్స్ అక్కడికి చేరుకొని గల్లంతైన వారి కోసం రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. ఈ క్రమంలో వారు ఓ మృతదేహాన్ని కనుగొన్నారు . కానీ డెడ్ బాడీ ఎవరిదీ అనేది ఇంకా తెలియాల్సి ఉంది. కాగా గల్లంతయినా వారిలో బ్రిటన్ కు చందిన బిజినెస్ మ్యాన్ మైక్ లించ్ కూడా ఉన్నారని ఇటలీ కోస్ట్ గార్డ్స్ అధికారులు వెల్లడించారు.

కోస్ట్ గార్డ్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. బ్రిటీష్ దేశం పేరుతో రిజిస్టర్ చేయబడిన ఈ లగ్జరీ నౌక AUG 14న సిసిలియన్ పోర్టు నుండి యాట్ కు బయలుదేరింది.నౌక పార్టీసెల్లో తీరానికి చేరుకున్న సమయంలో తుఫాను తాకిడికి మునిగిపోయింది. ఇందులో మొత్తంగా 12 మంది ప్రయాణికులు అలాగే 10 మంది సిబ్బంది ఉన్నట్లు అధికారులు ప్రకటనలో తెలిపారు. గల్లంతైన వారిలో ఒక సిబ్బంది, ఆరుగురు ప్రయాణీకులు ఉన్నారని , వారు బ్రిటీష్, అమెరికన్, కెనడియన్ జాతీయులని ఇటలీ అధికారులు తెలిపారు. కాగా 2008లో ఇటాలియన్ షిప్ బిల్డర్ పెరిని నిర్మించిన ఈ పడవకు కోస్ట్ గార్డ్ 'బయేసియన్' అని పేరు పెట్టారు. ఈ పడవ గరిష్టంగా 15 నాట్‌ల వేగాన్ని చేరుకోగలదు అలాగే 12 మంది అతిథులను,10 మంది సిబ్బందిని తీసుకెళ్లగలదు.


Similar News