Breaking : ఐక్యరాజ్యసమితిలో (UNO) భారత రాయబారిగా పర్వతనేని హరీష్ నియామకం
న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితిలో (UNO) భారత తదుపరి రాయబారిగా పర్వతనేని హరీష్ బుధవారం నియమితులయ్యారు.
దిశ, వెబ్‌డెస్క్ : న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితిలో (UNO) భారత తదుపరి రాయబారిగా పర్వతనేని హరీష్ బుధవారం నియమితులయ్యారు. కాగా హరీష్ కు పలు దేశాలలో దౌత్యవేత్తగా పని చేసిన అనుభవం ఉంది. 1990 ఇండియన్ ఫారిన్ సర్వీస్ (IFS) బ్యాచ్ కు చెందిన హరీష్ ప్రస్తుతం జర్మనీలో భారత రాయబారిగా పనిచేస్తున్నారు.త్వరలోనే ఆయన ఈ బాధ్యతలను చేపట్టే అవకాశం ఉందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA) ఒక ప్రకటనలో తెలిపింది. .కాగా ఇంతకముందు రుచిరా కాంబోజ్ UNO భారత రాయబారిగా పని చేశారు.జూన్‌లో అతను పదవీ విరమణ చేశారు. అప్పటినుంచి UNO లో భారత రాయబారి స్థానం ఖాళీగా ఉంది.