Boat Accident:ఘోర ప్రమాదం.. నదిలో పడవ బోల్తాపడి 64 మంది దుర్మరణం.. ఎక్కడంటే..?

నదిలో పడవ ప్రయాణం అంటేనే ఒళ్లు జలదరిస్తుంది.

Update: 2024-09-14 22:35 GMT

దిశ, వెబ్‌డెస్క్:నదిలో పడవ ప్రయాణం అంటేనే ఒళ్లు జలదరిస్తుంది. ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో తెలియని పరిస్థితి. పడవలో ప్రయాణించాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ ప్రయాణం సాగించాలి. నదిలో పడవ ప్రమాదాలు జరిగి ఎందరోమంది మృతిచెందిన ఘటనలు చాలా ఉన్నాయి.తాజాగా నదిలో బోల్తా పడి 64 మంది మరణించిన ఘటన నైజీరియా (Nigeria) దేశంలో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే..శనివారం నైజీరియా(Nigeria)లోని జంఫారా(Zamfara) రాష్ట్రంలో గుమ్మి(Gummi) పట్టణానికి చెందిన 70 మంది రైతులు పడవలో బయలుదేరారు.తమ వ్యవసాయ భూములకు చేరుకోవడానికి పడవలో నది మీదుగా వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు.సమాచారం అందుకున్న రెస్క్యూ సిబ్బంది సంఘటనా స్థలానికి వెంటనే చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.ఈ ఘటనలో రెస్క్యూ సిబ్బంది ఆరుగురుని రక్షించగా మిగతావారు గల్లంతైనట్లు తెలుస్తోంది.కాగా ప్రతిరోజు 900 మందికి పైగా రైతులు తమ వ్యవసాయ క్షేత్రాలకు చేరుకోవడానికి ఈ నది గుండా పడవలో ప్రయాణిస్తారు. అయితే కేవలం రెండు పడవలు మాత్రమే అందుబాటులో ఉండటంతో సామర్థ్యం కంటే ఎక్కువ మంది పడవలో ప్రయాణిస్తున్నారు .దీంతో రద్దీ ఎక్కువ ఉండటంతోనే పడవ ప్రమాదానికి గురయినట్లు స్థానిక పోలీసులు వెల్లడించారు.కాగా గుమ్మి లోకల్ ఏరియాలో ఇలాంటి ఘటన జరగడం ఇది రెండోసారి అని అమీను నుహు ఫలాలే (Aminu Nuhu Falale) అనే స్థానికుడు మీడియాతో తెలిపారు.పడవలో ఎవరెవరు ఉన్నారనే విషయంపై ఇంకా సృష్టత లేదని, సహాయక చర్యలు కొనసాగుతున్నాయని గుమ్మి పట్టణ పోలీసులు పేర్కొన్నారు.    


Similar News