Bangladesh : మైనారిటీలపై ఎవరు దాడులు చేసిన విడిచిపెట్టె ప్రసక్తే లేదు.. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం హెచ్చరిక

బంగ్లాదేశ్‌లో గత కొన్ని రోజుల నుంచి మైనార్టీలపై నిరసనకారులు దాడులు చేస్తున్న విషయం తెలిసిందే.

Update: 2024-08-16 22:00 GMT

దిశ, వెబ్‌డెస్క్ : బంగ్లాదేశ్‌లో గత కొన్ని రోజుల నుంచి మైనార్టీలపై నిరసనకారులు దాడులు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కొత్తగా ఏర్పడిన మధ్యంతర ప్రభుత్వం నిరసనకారులకు తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. ఈ మేరకు హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ యొక్క అధికారి మాట్లాడూతూ.. "మైనారిటీలపై ఎవరు దాడి చేసిన వారిపై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని,అలాగే తమ దేశంలో హింస, సంఘర్షణ , ద్వేషానికి చోటు లేదని" వెల్లడించారు. కాగా బంగ్లాదేశ్ లోని ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్‌నెస్ (ఇస్కాన్) ప్రతినిధి బృందం శుక్రవారం బంగ్లాదేశ్ బ్రిగేడియర్ జనరల్ (రిటైర్డ్) ఎం సఖావత్ హుస్సేన్ తో భేటీ అయ్యింది. ఈ భేటీలో ఇక నుంచి మైనార్టీలపై దాడులు జరగనివ్వబోమని సఖావత్ హుస్సేన్ ఇస్కాన్ (ISKCON) బృందానికి హామీ ఇచ్చారని 'ఢాకా ట్రిబ్యూన్' వార్తాపత్రిక తెలిపింది.

కాగా షేక్ హసీనా నేతృత్వంలోని గత ప్రభుత్వం పతనమయిన సంగతి తెలిసిందే . ప్రభుత్వ ఉద్యోగాలలో వివాదాస్పద కోటా విషయంలో తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన నిరసనల కారణంగా ఆగస్టు 5న రాజీనామా చేసి ఆమె భారతదేశానికి పారిపోయింది.దీంతో బంగ్లాదేశ్‌లో హిందూ సంఘాల సభ్యులపై నిరసనకారులు పలు చోట్ల దాడులు చేశారు. బంగ్లాదేశ్ మత సామరస్య దేశమని, ఇక్కడ అన్ని మతాల ప్రజలు ఎలాంటి విభేదాలు లేకుండా కలిసిమెలిసి ఉన్నారని బ్రిగేడియర్ సఖావత్ హుస్సేన్ తెలిపారు. కాగా.. ఆగస్టు 5న షేక్ హసీనా నేతృత్వంలోని ప్రభుత్వం పతనం అయినప్పటి నుంచి మైనారిటీ వర్గం 48 జిల్లాల్లోని 278 ప్రాంతాల్లో దాడులు, బెదిరింపులను ఎదుర్కొందని బంగ్లాదేశ్ నేషనల్ హిందూ గ్రాండ్ అలయన్స్ పేర్కొంది.బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వానికి నేతృత్వం వహిస్తున్న ముహమ్మద్ యూనస్ గత మంగళవారం హిందూ సమాజాన్నిఉద్దేశించి మాట్లాడూతూ.. మైనారిటీ సభ్యులపై దాడి చేసిన వారిని తమ ప్రభుత్వం శిక్షిస్తుందని , దయచేసి ఓపికతో మెలగండని హిందువులను కోరారు .అలాగే దేవాలయాలు, చర్చిలు లేదా మరేదైనా ఇతర మత సంస్థలపై దాడుల గురించి సమాచారాన్ని అందించాలని ప్రజలను కోరుతూ హోస్సేన్ మంత్రిత్వ శాఖ హాట్‌లైన్‌ను ఏర్పాటు చేసింది.


Similar News