అమెరికాలో భారతీయ పౌరుడికి ఐదేళ్ల జైలు శిక్ష..ఏ కేసులో అంటే?

అమెరికాలో ఓ భారతీయ పౌరుడికి అక్కడి న్యాయస్థానం ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. బన్మీత్ సింగ్ అనేత వ్యక్తి డార్క్ వెబ్‌లో డ్రగ్స్ అమ్ముతున్న కేసులో దోషిగా తేలడంతో కోర్డు ఈ నిర్ణయం తీసుకుంది.

Update: 2024-04-20 04:01 GMT

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికాలో ఓ భారతీయ పౌరుడికి అక్కడి న్యాయస్థానం ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. బన్మీత్ సింగ్ అనేత వ్యక్తి డార్క్ వెబ్‌లో డ్రగ్స్ అమ్ముతున్న కేసులో దోషిగా తేలడంతో కోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. వివరాల్లోకి వెళ్తే..హల్ద్వానీకి చెందిన బన్మీత్ సింగ్‌ అనే వ్యక్తి యూరప్ నుంచి అమెరికాకు డ్రగ్స్ సరఫరా చేసేవారు. దీంతో యూఎస్‌లో అతడిపై పలు కేసులు నమోదయ్యాయి. అనంతరం బన్మీత్ యూకేలో ఉన్నట్టు గుర్తించారు. అమెరికా అభ్యర్థన మేరకు 2019 ఏప్రిల్‌లో ఆయనను లండన్‌లో అరెస్టు చేశారు. అనంతరం 2023లో అమెరికాకు తీసుకొచ్చారు. అప్పటి నుంచి కేసు విచారణలో ఉండగా.. ఈ ఏడాది జనవరిలో నేరాన్ని అంగీకరించాడు. ఈ నేపథ్యంలోనే కోర్టు ఐదేళ్ల జైలు శిక్షతో పాటు బన్మీత్ నుంచి రూ.1.25 వేల కోట్లను జప్తు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.

బన్మీత్ సింగ్ ఫెంటానిల్, ఎల్‌ఎస్‌డీ, ఎక్స్‌టసీ, క్సానాక్స్, కెటామైన్‌తో సహా నియంత్రిత పదార్థాలను విక్రయించడానికి సిల్క్ రోడ్, ఆల్ఫా బే, హన్సా, ఇతర డార్క్ వెబ్‌లో మార్కెటింగ్ సైట్‌లను రూపొందించినట్టు పోలీసులు తెలిపారు. ఈ సైట్‌లను ఉపయోగించి డ్రగ్స్ విక్రయించే వాడు. దీనికి గాను కస్టమర్లు క్రిప్టో కరెన్సీ ద్వారా డబ్బు చెల్లించేవారు. 2012 నుంచి జూలై 2017 మధ్య కాలంలో బన్మీత్‌కు అమెరికాలో డ్రగ్స్ విక్రయానికి సంబంధించి 8 కేంద్రాలు ఉన్నట్టు గుర్తించారు. ఒహియో, ఫ్లోరిడా, నార్త్ కరోలినా, మేరీల్యాండ్, న్యూయార్క్, నార్త్ డకోటా, వాషింగ్టన్‌లలో ఈ సెంటర్లు ఉన్నాయి.

ఈ కేంద్రాల నుంచి డ్రగ్స్ సేకరించి యూఎస్‌లోని 50 రాష్ట్రాలతో పాటు, కెనడా, ఇంగ్లండ్, ఐర్లాండ్, జమైకా, స్కాట్లాండ్ దేశాలకు తిరిగి పంపించేవారని అధికారులు వెల్లడించారు. యూఎస్ వ్యాప్తంగా వందల కిలోల డ్రగ్స్ విక్రయించినట్టు తెలిపారు. కాగా, ఇటీవల డ్రగ్స్ స్మగ్లింగ్ కేసులో భాగంగా భారతీయ దంపతులకు బ్రిటన్ కోర్టు 33 ఏళ్ల జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే. 

Tags:    

Similar News