PM Modi: వేల కిలోమీటర్ల దూరంగా ఉన్నా.. మా హృదయాలకు దగ్గరే..

భారత సంతతికి చెందిన ఆస్ట్రోనాట్ సునితా విలియమ్స్ ( Sunita Williams) 9 నెలల తర్వాత భూమిపైకి వస్తున్నారు.

Update: 2025-03-18 12:56 GMT
PM Modi: వేల కిలోమీటర్ల దూరంగా ఉన్నా.. మా హృదయాలకు దగ్గరే..
  • whatsapp icon

దిశ, నేషనల్ బ్యూరో: భారత సంతతికి చెందిన ఆస్ట్రోనాట్ సునితా విలియమ్స్ ( Sunita Williams) 9 నెలల తర్వాత భూమిపైకి వస్తున్నారు. సునితాకు ప్రధాని మోడీ లేఖ రాశారు. ఆమె సాధించిన విజయాల పట్ల 140 కోట్ల మంది భారతీయులు గర్వంగా ఉన్నారని అన్నారు. ‘‘గతేడాది జూన్ 5న యూఎస్ పర్యటనకు వెళ్లినప్పుడు.. మీ గురించి అడిగితెలుసుకున్నాను. మీరు వేలాది కి.మీ.దూరంలో ఉన్నప్పటికీ.. మా హృదయాలకు దగ్గరగా ఉన్నారు. మీ అంతరిక్షయాత్ర విజయం సాధించాలని మేమంతా కోరుకుంటున్నాం. మీరు తిరిగి వచ్చిన తర్వాత మిమ్మల్ని భారత్‌లో చూసేందుకు ఎదురుచూస్తున్నాం. తన కుమార్తెలకు ఆతిథ్యం ఇవ్వడం పట్ల భారత్‌ సంతోషంగా ఉంటుంది’’ అని మోడీ అన్నారు. అంతేకాకుండా, సునితా భర్త మైఖేల్ విలియమ్స్‌కు కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. మార్చి ఒకటిన రాసిన లేఖను కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. ఈ లేఖ పట్ల సునీత సంతోషం వ్యక్తంచేశారు. దేశ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు.

మైక్ తో భేటీ తర్వాత..

మరోవైపు, ఈ నెలలో ఢిల్లీలో నాసా మాజీ వ్యోమగామి మైక్ మాసిమినోతో మోడీ సమావేశమయ్యారు. వారి సంభాషణలో సునితా పేరు ప్రస్తావనకు వచ్చిందని మోడీ గుర్తుచేసుకున్నారు. "మీ పట్ల, మీ పని పట్ల మేము ఎంత గర్వపడుతున్నామో చర్చించుకున్నాం. ఈ సంభాషణ తర్వాత నేను మీకు లేఖ రాయకుండా ఉండలేకపోయాను" అని ప్రధాని మోడీ అందులో పేర్కొన్నారు. సునితా తల్లి బోనీ పాండ్యా కూడా ఆమె రాక కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని చెప్పుకొచ్చారు. ఆమె తండ్రి దివంగత దీపక్‌భాయ్ ఆశీస్సులు కూడా తనకు ఉన్నాయని కచ్చితంగా తెలుసని అన్నారు. 2016లో అమెరికా పర్యటనలో భాగంగా దీపక్ తో భేటీ అయిన విషయాన్ని కూడా లేఖలో ప్రస్తావించారు. మరోవైపు, దీపక్ పాండ్యా స్వస్థలం గుజరాత్ కాగా.. ఆయన 2020లో చనిపోయారు.ఇకపోతే, సునితా విలియమ్స్(Sunita Williams) , బచ్‌ విల్మోర్ (Butch Wilmore) సహా మరో ఇద్దరు ఆస్ట్రోనాట్స్ బుధవారం తెల్లవారుజామున 3.27 గంటలకు ఈ వ్యోమనౌక ఫ్లోరిడా తీరంలోని సముద్ర జలాల్లో దిగుతుంది. సహాయ బృందాలు రంగంలోకి దిగి.. క్రూ డ్రాగన్‌ను వెలికితీస్తాయి.

Tags:    

Similar News