Sheikh Hasina : హసీనాకు భారత్ ఆశ్రయం.. బీఎన్‌పీ నేత కీలక వ్యాఖ్యలు

దిశ, నేషనల్ బ్యూరో : మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా‌కు భారత్ ఆశ్రయం కల్పించడంపై బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్‌పీ) సీనియర్ నేత ఖాందాకేర్ ముషర్రఫ్ హుసేన్ కీలక వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-08-09 15:50 GMT
Sheikh Hasina : హసీనాకు భారత్ ఆశ్రయం.. బీఎన్‌పీ నేత కీలక వ్యాఖ్యలు
  • whatsapp icon

దిశ, నేషనల్ బ్యూరో : మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా‌కు భారత్ ఆశ్రయం కల్పించడంపై బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్‌పీ) సీనియర్ నేత ఖాందాకేర్ ముషర్రఫ్ హుసేన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘బంగ్లాదేశ్ ప్రజలంతా వ్యతిరేకిస్తున్న హసీనాకు భారత్ ఆశ్రయం కల్పిస్తే.. సహజంగానే భారత్‌పై బంగ్లా ప్రజల్లో వ్యతిరేక వైఖరి ఏర్పడే అవకాశం ఉంటుంది’’ అని ఆయన కామెంట్ చేశారు.

‘‘అవామీ లీగ్ పార్టీకి, దాని నేతలకు భారత్ మద్దతు ఇవ్వదని బంగ్లాదేశ్ ప్రజలు ఆశిస్తున్నారు. ఎందుకంటే అవామీ లీగ్ పార్టీ అవినీతి, నియంతృత్వానికి మారుపేరు’’ అని ముషర్రఫ్ హుసేన్ అభిప్రాయపడ్డారు. ‘‘షేక్ హసీనా భారత్‌కు వెళ్లకుంటే బాగుండేది. ఎందుకంటే భారత్‌తో బంగ్లాదేశ్ స్నేహ సంబంధాలను కోరుకుంటోంది’’ అని మరో బీఎన్‌పీ నేత అబ్దుల్ అవ్వల్ మింటూ పేర్కొన్నారు.

Tags:    

Similar News