ఇజ్రాయెల్, హమాస్ మధ్య బీకర యుద్ధం.. 1,100కి పైగా మృతి..!
ఇజ్రాయెల్- పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హమాస్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. ఇప్పటి వరకు ఇరువైపుల దాడుల్లో 1,100 మందికిపైగా మరణించినట్లు
దిశ, డైనమిక్ బ్యూరో: ఇజ్రాయెల్- పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హమాస్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. ఇప్పటి వరకు ఇరువైపుల దాడుల్లో 1,100 మందికిపైగా మరణించినట్లు సమాచారం. వీరిలో విదేశాలకు సంబంధించిన వారు కూడా ఉన్నారు. కేవలం ఇజ్రాయెల్‌లో జరిగిన మ్యూజిక్ ఫెస్ట్‌లో 260 మందిని హమాస్ ఉగ్ర మూకలను చంపినట్లు ఇజ్రాయెల్ అధికారులు ప్రకటించారు.
ఇందులో ఎక్కువగా జర్మనీ, అమెరికా, ఇతర దేశ పౌరులు ఉన్నట్లు ప్రకటించారు. మరోవైపు దాదాపు 400 మంది హమాస్ తీవ్రవాదులను ఇజ్రాయెల్ సైన్యం హతమార్చినట్లు తాజాగా అధికారులు వెల్లడించారు. ఇప్పటికి హమాస్ తీవ్ర వాదుల చేతుల్లో ఇజ్రాయెల్ కొంత మంది ప్రజలు బందిగా ఉన్నట్లు వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇక ఇజ్రాయెల్ దేశానికి అమెరికా మద్దతు తెలిపింది. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా అధ్యక్షుడు జో బైడెన్ వెల్లడించారు.