మోడీని ప్రపంచం ప్రశంసిస్తోంది : అమిత్ షా

న్యూఢిల్లీ : కొవిడ్ 19ను కట్టడి చేయడానికి ప్రధాని నరేంద్ర మోడీ తీసుకుంటున్న చర్యలపై ప్రపంచం ప్రశంసలు కురిపిస్తోందని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. ప్రతి భారతీయుడు మోడీ పాలనలో సురక్షితంగా ఉన్నారని భావిస్తున్నట్టు తెలిపారు. వారందరూ మోడీని నమ్ముతున్నారని పేర్కొన్నారు. కరోనా ఆపత్కాలంలో భారతీయుల రక్షణకు పాటుపడుతూనే అంతర్జాతీయ సమాజానికి సహాయం చేస్తున్నారని ట్వీట్ చేశారు. మైక్రోసాఫ్ట్ సహవ్యవస్థాపకుడు బిల్‌గేట్స్.. నరేంద్ర మోడీని పొగడ్తల్లో ముంచెత్తారు. కరోనా విస్తృతిని కట్టడి చేసేందుకు […]

Update: 2020-04-23 04:09 GMT

న్యూఢిల్లీ : కొవిడ్ 19ను కట్టడి చేయడానికి ప్రధాని నరేంద్ర మోడీ తీసుకుంటున్న చర్యలపై ప్రపంచం ప్రశంసలు కురిపిస్తోందని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. ప్రతి భారతీయుడు మోడీ పాలనలో సురక్షితంగా ఉన్నారని భావిస్తున్నట్టు తెలిపారు. వారందరూ మోడీని నమ్ముతున్నారని పేర్కొన్నారు. కరోనా ఆపత్కాలంలో భారతీయుల రక్షణకు పాటుపడుతూనే అంతర్జాతీయ సమాజానికి సహాయం చేస్తున్నారని ట్వీట్ చేశారు. మైక్రోసాఫ్ట్ సహవ్యవస్థాపకుడు బిల్‌గేట్స్.. నరేంద్ర మోడీని పొగడ్తల్లో ముంచెత్తారు. కరోనా విస్తృతిని కట్టడి చేసేందుకు మోడీ ప్రభుత్వం తొందరగా అప్రమత్తమై లాక్‌డౌన్, హాట్‌స్పాట్లు, ఐసొలేషన్, క్వారంటైన్, ఆరోగ్య వ్యవస్థను పటిష్టం చేయడంలో సరైన చర్యలు తీసుకున్నదని ప్రశంసించారు. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమలవుతున్న నేపథ్యంలో పేదలకు అండగా నిలుస్తున్నదని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రశంసించిన విషయం తెలిసిందే.

Tags: coronavirus, pm narendra modi, amit shah, home minister, secure

Tags:    

Similar News