ఆరుట్లలో వరల్డ్ 'ఫొటోగ్రఫీ' డే.. వేడుకలు
దిశ ,ఇబ్రహీంపట్నం: ప్రపంచ ఫోటోగ్రాఫీ దినోత్సవం సందర్భంగా మంచాల మండల ఫొటోగ్రాఫర్స్ ఆధ్వర్యంలో ఆరుట్ల గ్రామంలో బుధవారం వేడుకలు జరుపుకున్నారు. కెమెరా సృష్టికర్త లూయిస్ డాగ్యురే గారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళ్ళు అర్పించారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు బాల్ రాజ్ మాట్లాడుతూ మండలంలోని ఫోటోవిడియోగ్రాఫర్స్ అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. కరోనా కారణంగా ఫొటో, విడియోగ్రాపర్స్ రోడ్డున పడ్డారని, తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలంటూ విజ్ఞప్తి […]
దిశ ,ఇబ్రహీంపట్నం: ప్రపంచ ఫోటోగ్రాఫీ దినోత్సవం సందర్భంగా మంచాల మండల ఫొటోగ్రాఫర్స్ ఆధ్వర్యంలో ఆరుట్ల గ్రామంలో బుధవారం వేడుకలు జరుపుకున్నారు. కెమెరా సృష్టికర్త లూయిస్ డాగ్యురే గారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళ్ళు అర్పించారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు బాల్ రాజ్ మాట్లాడుతూ మండలంలోని ఫోటోవిడియోగ్రాఫర్స్ అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు.
కరోనా కారణంగా ఫొటో, విడియోగ్రాపర్స్ రోడ్డున పడ్డారని, తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలంటూ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఫొటో, వీడియోగ్రాపర్ మాజీ మండల అధ్యక్షులు పిట్టల పెద్దులు, మండల ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి, రాజు, సతీష్ , శీను, జంగయ్య, జోగిని శేఖర్, మెగావత్ నరేష్, శ్రీనివాస్, యాదగిరి, లక్ష్మీకాంత్, మహేష్, శేఖర్ కాలేద్, రఘు నాయక్, రవి చారి తదితరులు పాల్గొన్నారు.