వరల్డ్ ఫేమస్ ఫుడ్‌కు కేరాఫ్ హైదరాబాద్

దిశ, శేరిలింగంపల్లి: భాగ్యనగరం అంటే బెస్ట్ ఫుడ్ కు కేరాఫ్. దమ్ బిర్యానీ టేస్ట్ ప్రపంచాన్నే మైమరిపింపజేస్తున్నది. నగరం భిన్న సంస్కృతుల సంగమమే కాదు విభిన్న వంటకాలకూ కేరాఫ్. ఇరానీ ఛాయ్, ధమ్ బిర్యానీ, పానీపూరి, పప్పు పరోటా, ఆలుకుర్మా, జొన్నరొట్టె, నాటుకోడి కూర, పొట్టేలు మాంసం.. ఇలా అనేకనేక రుచులకు పెట్టింది పేరు హైదరాబాద్. ఇక్కడ సౌత్, నార్త్, ఈస్ట్, వెస్ట్, ఇండో, చైనా ఇలా వంటకాల్లో ఎన్ని వెరైటీలు ఉన్నాయో అన్నీ అందుబాటులో ఉంటాయి. […]

Update: 2021-02-17 12:10 GMT

దిశ, శేరిలింగంపల్లి: భాగ్యనగరం అంటే బెస్ట్ ఫుడ్ కు కేరాఫ్. దమ్ బిర్యానీ టేస్ట్ ప్రపంచాన్నే మైమరిపింపజేస్తున్నది. నగరం భిన్న సంస్కృతుల సంగమమే కాదు విభిన్న వంటకాలకూ కేరాఫ్. ఇరానీ ఛాయ్, ధమ్ బిర్యానీ, పానీపూరి, పప్పు పరోటా, ఆలుకుర్మా, జొన్నరొట్టె, నాటుకోడి కూర, పొట్టేలు మాంసం.. ఇలా అనేకనేక రుచులకు పెట్టింది పేరు హైదరాబాద్. ఇక్కడ సౌత్, నార్త్, ఈస్ట్, వెస్ట్, ఇండో, చైనా ఇలా వంటకాల్లో ఎన్ని వెరైటీలు ఉన్నాయో అన్నీ అందుబాటులో ఉంటాయి. అన్ని వర్గాల వారికి, ఎవరికి ఏ ఫుడ్ కావాలంటే అది లభిస్తుంది. తమకు నచ్చిన ఆహారాన్ని తమ సహచరులతో కలిసి టేస్ట్ చేసేందుకు ఫుడ్ లవర్స్ పోటీ పడుతుంటారు.

నచ్చిన ఫుడ్.. మెచ్చే టేస్ట్‌లో..

 

హైదరాబాద్‌కు ఎంత చరిత్ర ఉందో ఇక్కడ లభించే ఫుడ్ కు అంతే చరిత్ర ఉంది. మహానగర జనాలు మంచి భోజన ప్రియులు. నగరంలో దొరకని వంటకం ఉండదు. వీధివీధికో టేస్ట్.., వెరైటీ ఫుడ్ ను ఆస్వాదించవచ్చు. ఇరానీ ఛాయ్‌ తో మొదలుకొని బిర్యానీ, నార్త్‌ ఇండియన్‌, మొఘలాయి తదితర వంటకాలు లభిస్తాయి. వినియోగదారుల టేస్ట్ కు, కస్టమర్ల జిహ్వచాపల్యానికి అనుగుణంగా వెరైటీలు వండి వార్చేందుకు పాకశాస్త్ర ప్రావీణ్యులు సైతం ఎప్పుడూ రెడీగా ఉంటారు. ఇక హోటల్ యజమానులు కస్టమర్లను నచ్చిన విధంగా ఫుడ్ సప్లై చేస్తూ ఆకర్షిస్తున్నారు.

అన్నీ ఫేమస్సే..

హైదరాబాద్ లో కమ్మని ధమ్ టీ, రుచికరమైన వంటకాలే కాకుండా ప్రపంచంలో ఎక్కడా దొరకని అత్యంత సువాసనల, రుచికరమైన బిర్యానీ కేవలం హైదరాబాద్ కే సొంతం. ప్యారడైజ్ బిర్యానీ అంటే ఇండియాలోనే కాదు వరల్డ్ వైడ్ గా పాపులర్. ఇదొక్కటే కాదు ప్రజల అభిరుచులకు అనుగుణంగా నగరంలో అనేక రెస్టారెంట్లు, బిర్యానీ హోటళ్లు వెలిసాయి. అవన్నీ కూడా భోజన ప్రియుల ప్రశంసలను అందుకుంటున్నాయి. నగరంలో లభించే బిర్యానీ, ధమ్ బిర్యానీ దానిలో ఉన్న రుచి ప్రపంచంలో ఎక్కడా దొరకదనే ప్రచారం ఉంది. లక్షల సంఖ్యలో బిర్యానీ పార్సిళ్లు విదేశాలకు ఎగుమతి చేయడం ద్వారా హైదరాబాద్ బిర్యానీకి ఉన్న డిమాండ్ ఏంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

అన్ని వర్గాల వారికి నచ్చే ఫుడ్

హోటల్స్, దాబాల్లో యూత్ కోసం, లవర్స్ కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తున్నారు నిర్వాహకులు. కొన్ని రెస్టారెంట్స్, హోటల్స్ లో ఓన్లీ ఫ్యామిలీలనే అలో చేస్తారు. ఇంకొన్ని చోట్ల లవర్స్ కోసం స్పెషల్ క్యాబిన్స్ ఏర్పాటు చేస్తున్నారు. ఫుడ్ విషయంలోనూ అనేక వెరైటీస్ కు ప్రియారిటీ ఇస్తుంది యూత్. ఇది వరకంటే ఇప్పుడు చైనీస్ ఫుడ్ కోసం లొట్టలేస్తున్నారు. అలాగే నార్త్ ఇండియన్ ఫుడ్ ను సైతం బాగా ఇష్టపడుతున్నారని హోటల్స్ నిర్వాహకులు చెబుతున్నారు. అలాగే అమ్మాయిలు నాన్ వెజ్ తినేందుకు ఏమాత్రం వెనకాడడం లేదని, కబాబ్స్ ప్లాటర్స్, ఫ్రైస్ బాగా ప్రిఫర్ చేస్తున్నారని అంటున్నారు చెఫ్స్.

ఎన్నో వెరైటీలు: డేవిడ్ పాల్
సిటీలో ఎన్నెనో వెరైటీ ఫుడ్స్ లభిస్తాయి. రాత్రి, పగలు అనే తేడా ఉండదు. ఉదయం, సాయంత్రం, అర్ధరాత్రి కూడా హైదరాబాద్ లో బిర్యానీ రెడీగా ఉంటుంది. నచ్చిన వెరైటీ తినొచ్చు. ఒక్కోచోట ఒక్కో ఫుడ్ టేస్టీగా ఉంటుంది. నాకైతే హైదరాబాద్ ధమ్ బిర్యానీ అంటే చాలా ఇష్టం.

ఢోకా లేదు: శంకర్
హైదరాబాద్ లో ఫుడ్ కు ఢోకా లేదు. రోడ్డు పక్కన కాకా హోటల్ నుంచి ఫైవ్ స్టార్ హోటల్స్ వరకూ మంచి ఫుడ్ లభిస్తుంది. మనకు బిర్యానీ ఫేమస్. అలాగే నార్త్ ఇండియన్ ఫుడ్ కూడా బాగుంటుంది.

Tags:    

Similar News