బాయిలర్ పేలి కార్మికుడు మృతి
దిశ, ఏపీ బ్యూరో: కర్నూలు జిల్లా నంద్యాల ఎస్పీవై ఆగ్రో పరిశ్రమలో మళ్లీ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతిచెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఫ్యాక్టరీ బాయిలర్ యూనిట్‌లోని వేడి నీళ్ల పైపు లీకైంది. దీంతో వేడి నీళ్లు మీద పడి ముగ్గురు కార్మికులు తీవ్ర గాయాలపాలయ్యారు. క్షతగాత్రులను నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించగా, వీరిలో లక్ష్మణమూర్తి(62) అనే కార్మికుడి పరిస్థితి విషమంగా ఉండటంతో కర్నూలు ప్రభుత్వాసుపత్రికి రిఫర్ చేశారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ లక్ష్మణమూర్తి […]
దిశ, ఏపీ బ్యూరో: కర్నూలు జిల్లా నంద్యాల ఎస్పీవై ఆగ్రో పరిశ్రమలో మళ్లీ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతిచెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఫ్యాక్టరీ బాయిలర్ యూనిట్‌లోని వేడి నీళ్ల పైపు లీకైంది. దీంతో వేడి నీళ్లు మీద పడి ముగ్గురు కార్మికులు తీవ్ర గాయాలపాలయ్యారు.
క్షతగాత్రులను నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించగా, వీరిలో లక్ష్మణమూర్తి(62) అనే కార్మికుడి పరిస్థితి విషమంగా ఉండటంతో కర్నూలు ప్రభుత్వాసుపత్రికి రిఫర్ చేశారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ లక్ష్మణమూర్తి మృతి చెందాడు. మిగతా ఇద్దరు కార్మికులు చికిత్స పొందుతున్నారు.
కాగా, ఇటీవలే ఎస్పీవై ఆగ్రో ఫ్యాక్టరీలో మెయిన్ టెనెన్స్ వర్క్స్ జరుగుతున్న సమయంలో జరిగిన ప్రమాదంలో జనరల్ మేనేజర్ మృతిచెందిన సంగతి తెలిసిందే. ఆ ఘటన మరువకముందే మరో ప్రమాదం జరగడంతో ఫ్యాక్టరీలో పనిచేస్తున్న కార్మికులు ఆందోళన చెందుతున్నారు.