కొత్త భవనం వింతలెన్నో..

దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్ భవనం ఆంగ్లేయుల కాలంలో నిర్మించారు. ఈ భవనం డిజైన్‌ను ఎడ్విన్ లుటియన్స్, హెర్బర్ట్ బేకర్స్ అందించారు. వీరే ఢిల్లీ‌ నగర నిర్మాణ రూపకర్తలు కూడా. 1921, ఫిబ్రవరి 21న శంకుస్తాపన జరిగింది. నిర్మాణం పూర్తి కావడానికి ఆరేండ్లు పట్టగా రూ.83లక్షలు ఖర్చయ్యింది. 1927, జనవరి 18న అప్పటి భారత గవర్నర్ జనరల్ లార్డ్ ఇర్విన్ పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించారు. సెంట్రల్ విస్టా డెవలప్‌మెంట్ ప్రాజెక్టులో భాగంగా ప్రస్తుత పార్లమెంట్ భవనానికి సమీపంలో కొత్త […]

Update: 2020-12-10 08:54 GMT

దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్ భవనం ఆంగ్లేయుల కాలంలో నిర్మించారు. ఈ భవనం డిజైన్‌ను ఎడ్విన్ లుటియన్స్, హెర్బర్ట్ బేకర్స్ అందించారు. వీరే ఢిల్లీ‌ నగర నిర్మాణ రూపకర్తలు కూడా. 1921, ఫిబ్రవరి 21న శంకుస్తాపన జరిగింది. నిర్మాణం పూర్తి కావడానికి ఆరేండ్లు పట్టగా రూ.83లక్షలు ఖర్చయ్యింది. 1927, జనవరి 18న అప్పటి భారత గవర్నర్ జనరల్ లార్డ్ ఇర్విన్ పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించారు.

సెంట్రల్ విస్టా డెవలప్‌మెంట్ ప్రాజెక్టులో భాగంగా ప్రస్తుత పార్లమెంట్ భవనానికి సమీపంలో కొత్త భవనం నిర్మించనున్నారు. గత సెప్టెంబర్‌లో కొత్త పార్లమెంట్ భవన నిర్మాణం కోసం టెండర్లు పిలువగా కాంట్రాక్టును టాటా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ సొంతం చేసుకుంది. పార్లమెంటరీ మంత్రిత్వశాఖ కార్యాలయం, లోక్‌సభ, రాజ్యసభ సెక్రటేరియట్లు, ప్రధాన మంత్రి కార్యాలయం, ఎంపీల కోసం కొన్ని కార్యాలయాలు సహా మొత్తం 120 ఆఫీస్ స్పేస్‌లను అందుబాటులో ఉంచనున్నారు. ఎంపీల కోసం రీడింగ్ రూమ్ ‌కూడా ఉంటుంది. కానీ, సెంట్రల్ హాల్ ఉండదు.

కొత్త పార్లమెంట్ భవన నిర్మాణ ఆలోచన ఏడేళ్ల క్రితం నాటిది. ప్రస్తుత భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో పునర్వ్యవస్థీకరించాలి లేదా కొత్త భవనమైనా నిర్మించాలని ఇద్దరు లోక్‌సభ స్పీకర్లు ప్రతిపాదించారు. ముఖ్యంగా మాజీ స్పీకర్ సుమిత్రా మహాజన్ నూతన భనవ అవశ్యకతను ప్రభుత్వానికి తెలియజేశారు. కాగితం వినియోగం లేకుండా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎంపీలకు అందుబాటులో ఉంచేలా ఉండాలని కోరారు.

ప్రస్తుతం ఉన్న లోక్‌సభ చాంబర్‌లో 543 సీటింగ్ సౌకర్యం ఉంది. కానీ, కొత్త భవనంలో 888 సీట్ల సౌకర్యం ఉంటుంది. రాజ్యసభ చాంబర్‌లో 245 సీటింగ్ సౌకర్యం ఉండగా, కొత్త దాంట్లో 384 ఉండనున్నది. ప్రస్తుతం ఉభయసభల సంయుక్త సమావేశం పార్లమెంట్ సెంట్రల్‌ హాల్‌లో నిర్వహిస్తున్నారు. కొత్త భవనంలో లోక్‌సభ చాంబర్‌లో నిర్వహించేలా సీటింగ్ సౌకర్యం పెంచుతున్నారు. ఒక్కో సీటులో ఇద్దరు కూర్చునే సౌకర్యం ఉంటుంది. ఒకవేళ ఉభయసభల సంయుక్త సమావేశం నిర్వహిస్తే మూడు సీట్లకు పెంచుకోవచ్చు.

మహాత్మాగాంధీ కాంస్య విగ్రహానికి ప్రత్యేక స్థానం ఉన్నది. ఇక్కడే విపక్ష నేతలు నిరసనలు వ్యక్తం చేస్తుంటారు. నూతన భవన నిర్మాణ పనులు ప్రారంభం కాగానే జాతిపిత విగ్రహంతోపాటు పార్లమెంట్‌లోని ఇతర స్మారక చిహ్నాలను తరలించి సంరక్షించనున్నారు. నిర్మాణం పూర్తయిన తర్వాత తిరిగి తీసుకువస్తారు. కొత్త భవనం ప్రధాన ద్వారం దగ్గర మహాత్ముడి విగ్రహం ఏర్పాటు చేసే అవకాశం ఉంది.

నిర్మాణ సంస్థ: టాటా ప్రాజెక్ట్స్ లిమిటెడ్
డిజైన్: హెచ్‌సీపీ డిజైన్, ప్లానింగ్, మేనేజ్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్
నిర్మాణం ప్రారంభం: డిసెంబర్ 10న ప్రధాని శంకుస్థాపన చేశారు. సుప్రీంకోర్టులో కేసు నేపథ్యంలో నిర్మాణం ప్రారంభంపై స్పష్టత లేదు
పూర్తి: 2022 వరకు
భవనం విస్తీర్ణం: 64,500 మీటర్లు
ఖర్చు అంచనా: రూ.971కోట్లు
మొత్తం గేట్లు: 6 (ప్రధాని, రాష్ట్రపతి.. లోక్‌సభ, రాజ్యసభ చైర్మన్, ఎంపీలు.. ప్రత్యేకంగా ఎంపీల కోసం.. సాధారణ ద్వారా ఒకటి, సాధారణ ప్రజల కోసం రెండు గేట్లు ఉంటాయి.)
ఎన్ని అంతస్తులు: నాలుగు. లోయర్, అప్పర్ గ్రౌండ్, ఫస్ట్, సెకండ్ ఫ్లోర్లు ఉంటాయి.

Tags:    

Similar News