విమెన్స్ వరల్డ్ కప్ వాయిదా.. కారణం అది కాదు : ICC
దిశ, స్పోర్ట్స్: న్యూజిలాండ్ వేదికగా 2021 ఫిబ్రవరిలో జరగాల్సిన మహిళా వన్డే ప్రపంచ కప్ (Womens odi world cup)ను ఏడాది పాటు వాయిదా వేస్తూ ఇంటర్నేషన్ క్రికెట్ కౌన్సిల్ (ICC) నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ మెగా ఈవెంట్ 2022 ఫిబ్రవరి 6 నుంచి మార్చి 7 వరకు జరగనుంది. కాగా, ఈ వాయిదా నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అనేక మంది మహిళా క్రికెటర్లు కూడా తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇంగ్లాండ్ […]
దిశ, స్పోర్ట్స్: న్యూజిలాండ్ వేదికగా 2021 ఫిబ్రవరిలో జరగాల్సిన మహిళా వన్డే ప్రపంచ కప్ (Womens odi world cup)ను ఏడాది పాటు వాయిదా వేస్తూ ఇంటర్నేషన్ క్రికెట్ కౌన్సిల్ (ICC) నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ మెగా ఈవెంట్ 2022 ఫిబ్రవరి 6 నుంచి మార్చి 7 వరకు జరగనుంది. కాగా, ఈ వాయిదా నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
అనేక మంది మహిళా క్రికెటర్లు కూడా తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇంగ్లాండ్ మహిళా జట్టు కెప్టెన్ హీథర్ నైట్ ఒకడుగు ముందుకు వేసి ఐసీసీపై విమర్శలు గుప్పించారు. ప్రపంచ కప్ (World cup) నిర్వహించాలనే కృతనిశ్చయంతో Icc లేదని ఆరోపించారు. ఇది మహిళా క్రికెట్‌పై వివక్ష (criticism) చూపడమేనని తీవ్రంగా మండిపడ్డారు. కాగా, ఈ విమర్శలపై ఐసీసీ వన్డే వరల్డ్ కప్ సీఈవో ఆండ్రియా నెల్సన్ స్పందించారు. ‘లాక్‌డౌన్ (lockdown) కారణంగా క్రీడాకారిణులు సన్నద్ధమవడానికి సమయం సరిపోవడం లేదు. ఇంకా పూర్తి స్థాయి ప్రాక్టీస్ మొదలు కాలేదు. మరోవైపు క్వాలిఫయింగ్ రౌండ్స్ కూడా నిర్వహించలేదు.
వీటన్నింటికీ సమయం సరిపోవడం లేదు. అందుకే వాయిదా (postpone) చేయక తప్పలేదు’ అని ఆండ్రియా తెలిపారు. మరోవైపు వైరస్ వ్యాప్తి కారణంగా వచ్చే ఏడాది ఫిబ్రవరిలో టోర్నీని నిర్వహించడం కూడా కష్టమని ఆమె స్పష్టంచేశారు. న్యూజిలాండ్‌లో కరోనా (carona) లేదనే విషయం తెలుసు. కానీ క్వాలిఫయింగ్ రౌండ్ మ్యాచులు కూడా జరగలేదు. కావున, వాయిదా తప్పలేదని ఆమె పేర్కొన్నారు.