Bhatti: పారిశ్రామికవేత్తలుగా మహిళలు!.. డిప్యూటీ సీఎం భట్టి కీలక వ్యాఖ్యలు

స్వయం సహాయక సంఘాల(Self-Help Groups) మహిళలను పారిశ్రామికవేత్తలు(Women Entrepreneurs)గా చేసేందుకు ప్రజా ప్రభుత్వం కృషి చేస్తోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka) అన్నారు.

Update: 2024-11-15 14:38 GMT
Bhatti: పారిశ్రామికవేత్తలుగా మహిళలు!.. డిప్యూటీ సీఎం భట్టి కీలక వ్యాఖ్యలు
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్: స్వయం సహాయక సంఘాల(Self-Help Groups) మహిళలను పారిశ్రామికవేత్తలు(Women Entrepreneurs)గా చేసేందుకు ప్రజా ప్రభుత్వం కృషి చేస్తోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka) అన్నారు. శుక్రవారం ప్రజాభవన్(Praja Bhavan) లో అధికారులతో డిప్యూటీ సీఎం భట్టి సమావేశం అయ్యారు. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. దీనిపై ఆయన ఇందిరా మహిళా శక్తి పథకం(Indira Mahila Shakti scheme) ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని స్వయం సహాయక సంఘాల సభ్యులను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలని ప్రజా ప్రభుత్వం(Public Government) నిర్ణయించిందని, గ్రామీణ మహిళలు ఆర్థికంగా, సామాజికంగా బలోపేతం అయ్యేందుకు మా ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు.

ఇందులో భాగంగానే ప్రజాభవన్ లో అధికారులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి పలు సూచనలు చేయడం జరిగిందని చెప్పారు. స్వయం సహాయక సంఘాలకు ఫెడరేషన్ల ద్వారా రాష్ట్రంలో పెద్ద ఎత్తున సోలార్ పవర్ ఉత్పత్తికి త్వరతిగతిన చర్యలు ప్రారంభించాలని ఆదేశాలు ఇచ్చారు. అందుకు అవసరమైన స్థలాలను సేకరించి స్వయం సహాయక సంఘాలకు లీజుకు ఇవ్వాలని సమావేశంలో నిర్ణయించారు. అంతేగాక సోలార్ పవర్ ఉత్పత్తికి అవసరమైన ఆర్థిక నిధులకు గాను బ్యాంకర్లతో సమావేశం నిర్వహించి, రుణాలు ఇప్పించే ఏర్పాటు చేయాలని భట్టి సూచించారు.

Tags:    

Similar News