జోరు పెంచిన షర్మిల.. మహిళల సంపూర్ణ మద్దతు
దిశ, తెలంగాణ బ్యూరో : ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన మహిళలు హైదరాబాద్ లోటస్ పాండ్లో మంగళవారం షర్మిలను కలిసి తమ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా వారు షర్మిలకు తమ ప్రాంత సమస్యలను గురించి వివరించారు. ఒక మహిళ పార్టీ పెట్టడం ఎంతో శ్రమతో కూడుకున్న విషయమని, అందుకే సాటి మహిళలుగా తామంతా షర్మిలకు అండగా నిలిచేందుకు స్వచ్ఛందంగా వచ్చినట్లు పేర్కొన్నారు. ఏప్రిల్ 9వ తేదీన ఖమ్మంలో నిర్వహిస్తున్న సంకల్ప సభకు భారీగా మహిళలను […]
దిశ, తెలంగాణ బ్యూరో : ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన మహిళలు హైదరాబాద్ లోటస్ పాండ్లో మంగళవారం షర్మిలను కలిసి తమ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా వారు షర్మిలకు తమ ప్రాంత సమస్యలను గురించి వివరించారు. ఒక మహిళ పార్టీ పెట్టడం ఎంతో శ్రమతో కూడుకున్న విషయమని, అందుకే సాటి మహిళలుగా తామంతా షర్మిలకు అండగా నిలిచేందుకు స్వచ్ఛందంగా వచ్చినట్లు పేర్కొన్నారు. ఏప్రిల్ 9వ తేదీన ఖమ్మంలో నిర్వహిస్తున్న సంకల్ప సభకు భారీగా మహిళలను తరలించి మహిళా శక్తిని చాటుతామని వారు స్పష్టం చేశారు.
ఆత్మీయ సమ్మేళనాలు ముగింపు..
ఉమ్మడి మెదక్ జిల్లావాసులతో షర్మిల బుధవారం ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించనున్నారు. ఈ సమావేశంతో ఆత్మీయ సమ్మేళనాలు ముగిసినట్లేనని షర్మిల కార్యాలయ వర్గం ప్రకటించింది. ఏప్రిల్ 9వ తేదీన ఖమ్మం జిల్లాలో నిర్వహించనున్న సభమీదే తమ పూర్తి ఫోకస్ ఉండబోతోందని వారు స్పష్టం చేశారు.