మహిళల జీవనోపాధిలో మార్పు తేవాలి..
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాల మహిళల జీవనోపాధిలో మార్పు తీసుకురావాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అధికారులను ఆదేశించారు. సెర్ప్, మెప్మాలు చేపడుతున్న పలు కార్యక్రమాలు, కార్యాచరణ ప్రణాళికలపై శుక్రవారం బీఆర్కే భవన్‌లో అధికారులతో సీఎస్ సమీక్ష నిర్వహించారు. వ్యవసాయం, ఫుడ్ ప్రాసెసింగ్, సాయిల్ టెస్టింగ్, కూరగాయల సాగు, పశుసంవర్ధకం, న్యూట్రిషన్ తదితర రంగాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఐటీ వినియోగం, సామర్థ్యం పెంపుదల, జీవనోపాధి, ఎంటర్‌ప్రైస్, డెవలప్‌మెంట్, కన్వర్జెన్సీ వంటి […]
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాల మహిళల జీవనోపాధిలో మార్పు తీసుకురావాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అధికారులను ఆదేశించారు. సెర్ప్, మెప్మాలు చేపడుతున్న పలు కార్యక్రమాలు, కార్యాచరణ ప్రణాళికలపై శుక్రవారం బీఆర్కే భవన్‌లో అధికారులతో సీఎస్ సమీక్ష నిర్వహించారు.
వ్యవసాయం, ఫుడ్ ప్రాసెసింగ్, సాయిల్ టెస్టింగ్, కూరగాయల సాగు, పశుసంవర్ధకం, న్యూట్రిషన్ తదితర రంగాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఐటీ వినియోగం, సామర్థ్యం పెంపుదల, జీవనోపాధి, ఎంటర్‌ప్రైస్, డెవలప్‌మెంట్, కన్వర్జెన్సీ వంటి అంశాలపై ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని సూచించారు. మున్సిపల్ శాఖ ముఖ్యకార్యదర్శి అర్వింద్ కుమార్, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, వ్యవసాయ శాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డి, ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి క్రిస్టినా చోంగ్తు, ఆర్థికశాఖ ప్రత్యేక కార్యదర్శి రోనాల్డ్ రోస్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్, గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ కమిషనర్ రఘునందన్‌రావు, హార్టికల్చర్ డైరెక్టర్ వెంకట్రాంరెడ్డి, అగ్రికల్చర్ మార్కెటింగ్ డైరెక్టర్ లక్ష్మీబాయి పాల్గొన్నారు.