ప్రభుత్వ మద్యం ధ్వంసం.. మహిళలే సూత్రధారులు
దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ మద్యం విక్రయాలపై మహిళలు కన్నేర్ర చేశారు. కరోనా వల్ల ఇప్పటికే పనులు లేక రోడ్డునపడ్డామని, మరోవైపు మద్యం అమ్మకాల వల్ల తమ భర్తలు రోజు మందు తాగుతున్నామని వాపోతున్నారు. ఇతర గ్రామల నుంచి వచ్చే మద్యం కొనుగోలు దారులతో గ్రామాల్లో కరోనా వైరస్ వ్యాపిస్తోందని మండిపడ్డారు. ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం బొద్దికూరపాడులో జరిగిన ఈ ఘటనలో మహిళలు మద్యం సీసాలను ధ్వంసం చేసి ఆందోళనకు దిగారు. తాగుబోతుల […]
దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ మద్యం విక్రయాలపై మహిళలు కన్నేర్ర చేశారు. కరోనా వల్ల ఇప్పటికే పనులు లేక రోడ్డునపడ్డామని, మరోవైపు మద్యం అమ్మకాల వల్ల తమ భర్తలు రోజు మందు తాగుతున్నామని వాపోతున్నారు. ఇతర గ్రామల నుంచి వచ్చే మద్యం కొనుగోలు దారులతో గ్రామాల్లో కరోనా వైరస్ వ్యాపిస్తోందని మండిపడ్డారు. ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం బొద్దికూరపాడులో జరిగిన ఈ ఘటనలో మహిళలు మద్యం సీసాలను ధ్వంసం చేసి ఆందోళనకు దిగారు. తాగుబోతుల ఆగడాలు మితిమీరిపోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తమ కుటుంబంలో మగవారు నిత్యం షాపుల వద్దే ఉంటున్నారని .. ఇంట్లో ఉన్న నాలుగు పైసలను కూడా మందు కోసం ఖర్చు చేస్తున్నారని వాపోయారు. మగవాళ్లు సంపాదనంతా మందు కోసం తగలేస్తే ఏం తిని బతకాలని ఈ గ్రామ మహిళలు ప్రశ్నిస్తున్నారు. కనీసం కరోనా కనుమరుగయ్యే వరకు మద్యం షాపులు తెరవొద్దని డిమాండ్ చేస్తున్నారు. పక్క గ్రామాల నుంచి వచ్చిన తాగుబోతులు.. మద్యంను కొనుకున్న తర్వాత అక్కడే తాగుతున్నారని… అంతేకాకుండా తమ గ్రామంలోని మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్థిస్తున్నారని వారు ఆరోపించారు.