ఒంటరైన పిల్లలు.. బ్లేడుతో గొంతు కోసుకున్న తల్లి
దిశ, రఘునాథపల్లి : ఏం కష్టం వచ్చిందో ఏమో కానీ ఓ తల్లి ఆత్మహత్య చేసుకుని తన పిల్లలను అనాధలను చేసింది. ఒక్క క్షణం వారి గురించి ఆలోచించి ఉంటే క్షణికావేశంలో ఆత్మహత్య చేసుకునేది కాదేమో.. ఈ ఘటన జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం అశ్వారావుపల్లిలో జరిగింది. తూరుగొండ సుమతి (30) అనే మహిళ బుధవారం ఇంటి వద్ద ఎవరూ లేని సమయంలో బ్లేడుతో గొంతు కోసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. గమనించిన స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం […]
దిశ, రఘునాథపల్లి : ఏం కష్టం వచ్చిందో ఏమో కానీ ఓ తల్లి ఆత్మహత్య చేసుకుని తన పిల్లలను అనాధలను చేసింది. ఒక్క క్షణం వారి గురించి ఆలోచించి ఉంటే క్షణికావేశంలో ఆత్మహత్య చేసుకునేది కాదేమో.. ఈ ఘటన జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం అశ్వారావుపల్లిలో జరిగింది. తూరుగొండ సుమతి (30) అనే మహిళ బుధవారం ఇంటి వద్ద ఎవరూ లేని సమయంలో బ్లేడుతో గొంతు కోసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
గమనించిన స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించి ప్రథమ చికిత్స కోసం జనగామ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆ మహిళ మృతి చెందింది. ఆర్థిక ఇబ్బందుల వల్లే ఆమె ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని అందరూ అనుమానిస్తున్నారు. సుమతి ఎనిమిదేళ్ల కిందట ప్రేమ వివాహం చేసుకోగా నాలుగేళ్లలోపు కూతురు, కొడుకు ఉన్నారని తెలుస్తోంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ రాజేష్ నాయక్ తెలిపారు.