IND VS NZ: రెండో టెస్టుకు మహిళా స్కోరర్లు
దిశ, స్పోర్ట్స్: వాంఖడే స్టేడియంలో ఒక టెస్టు మ్యాచ్‌కు స్కోరర్లుగా వ్యవహరిస్తున్న తొలి మహిళలుగా సుష్మ సావంత్, క్షమా సానే రికార్డులకు ఎక్కారు. 1975 జనవరిలో ముంబైలోని వాంఖడేలో తొలి టెస్టు జరిగింది. అప్పటి నుంచి పురుషులే స్కోరర్లుగా ఉన్నారు. అయితే ఇటీవల స్కోరర్లుగా మహిళలను నియమించాలని బీసీసీఐ నిర్ణయం తీసుకున్నది. ఇందులో భాగంగా కొంత మందికి శిక్షణ కూడా అందించింది. వారిలో తొలి బ్యాచ్‌కు చెందిన ఇద్దరిని ఇండియా – న్యూజీలాండ్ రెండోటెస్టుకు స్కోరర్లుగా నియమించింది. […]
దిశ, స్పోర్ట్స్: వాంఖడే స్టేడియంలో ఒక టెస్టు మ్యాచ్‌కు స్కోరర్లుగా వ్యవహరిస్తున్న తొలి మహిళలుగా సుష్మ సావంత్, క్షమా సానే రికార్డులకు ఎక్కారు. 1975 జనవరిలో ముంబైలోని వాంఖడేలో తొలి టెస్టు జరిగింది. అప్పటి నుంచి పురుషులే స్కోరర్లుగా ఉన్నారు. అయితే ఇటీవల స్కోరర్లుగా మహిళలను నియమించాలని బీసీసీఐ నిర్ణయం తీసుకున్నది. ఇందులో భాగంగా కొంత మందికి శిక్షణ కూడా అందించింది. వారిలో తొలి బ్యాచ్‌కు చెందిన ఇద్దరిని ఇండియా – న్యూజీలాండ్ రెండోటెస్టుకు స్కోరర్లుగా నియమించింది.
సుష్మ 2008లో స్కోరర్‌గా కెరీర్ మొదలు పెట్టింది. క్రికెటర్ అయిన భర్త నితిన్ సావంత్ ప్రోత్సాహంతో సుష్మ ఈ రంగంలో నిలదొక్కుకోగలిగింది. 2010 నుంచి బీసీసీఐ కూడా మహిళా స్కోరర్లను నియమించుకోవడం ప్రారంభించడంతో సుష్మ దశ తిరిగింది. రంజీ ట్రోఫీ, ఐపీఎల్ మ్యాచ్‌లకు స్కోరర్‌గా అవకాశం దక్కింది. మరోవైపు క్షమా చిన్నప్పటి నుంచి క్రికెటర్ అవ్వాలని అనుకున్నది. క్షమ తల్లి ఆమెను క్రికెటర్‌గా చూడాలని కోరుకున్నది. అయితే క్షమాకు క్రికెటర్‌గా సరైన అవకాశాలు రాకపోవడంతో కార్పొరేట్ సెక్టార్‌లో జాబ్ చేయడం మొదలు పెట్టింది. అయితే క్రికెట్‌పై మక్కువతో పార్ట్‌టైంలో స్కోరర్‌గా పని చేసేది. అయితే రెండింటినీ బ్యాలెన్స్ చేయడం కష్టం కావడంతో కార్పొరేట్ జాబ్‌ను వదిలేసి.. 2018 నుంచి స్కోరర్‌గా స్థిరపడిపోయింది.