కరోనా కట్టడికి మహిళా పోలీసుల సేవలు భేష్

దిశ, మెదక్: కరోనా వ్యా ధి నివారణలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్ అమలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు విచ్చలవిడిగా రోడ్లపైకి రాకుండా ఉండేందుకు పురుషులతో సమానంగా మహిళా పోలీసులు కూడా విశేషంగా సేవలందిస్తున్నారు.సోమవారం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణ పోలీస్ స్టేషన్‌కు చెందిన మహిళా పోలీసులు, ఇతర ప్రాంతాల నుంచి బందోబస్తు కోసం జహీరాబాద్ వచ్చిన పోలీసు సిబ్బందితో పోటీ పడుతూ విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించేందుకు మహిళా పోలీసులు […]

Update: 2020-04-13 09:00 GMT

దిశ, మెదక్: కరోనా వ్యా ధి నివారణలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్ అమలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు విచ్చలవిడిగా రోడ్లపైకి రాకుండా ఉండేందుకు పురుషులతో సమానంగా మహిళా పోలీసులు కూడా విశేషంగా సేవలందిస్తున్నారు.సోమవారం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణ పోలీస్ స్టేషన్‌కు చెందిన మహిళా పోలీసులు, ఇతర ప్రాంతాల నుంచి బందోబస్తు కోసం జహీరాబాద్ వచ్చిన పోలీసు సిబ్బందితో పోటీ పడుతూ విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించేందుకు మహిళా పోలీసులు వాహనదారులకు, ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. వీరు చేస్తున్న కృషికి పట్టణ ప్రజలు అభినందిస్తున్నారు.పట్టణంలో కావాలని బయట తిరుగుతున్నఆకతాయిల పని కూడా పడుతున్నారని మహిళా పోలీసులను పలువురు ప్రశంసిస్తున్నారు.

tags: corona, lockdown, women police, service good

Tags:    

Similar News