ఎమ్మెల్యేకు చేదు అనుభవం.. అడ్డగించి నిలదీసిన మహిళలు
దిశ, ఖానాపూర్: ఎమ్మెల్యే రేఖానాయక్‌కు చేదు అనుభవం ఎదురైంది. నిర్మల్ జిల్లా కడం మండలంలోని పలు గ్రామాల్లో బుధవారం బతుకమ్మ చీరలు పంపిణీ చేయడానికి వచ్చిన ఎమ్మెల్యేను కొండుకూరు గ్రామంలో ఇందిరమ్మ కాలనీ మహిళలు అడ్డుకున్నారు. డ్రైనేజీ సమస్య పరిష్కరించాలని కారును అడ్డగించి నిరసన తెలిపారు. డ్రైనేజీ సమస్యను తట్టుకోలేకపోతున్నామని, సమస్య పరిష్కరించాల్సిందే అని నిలదీశారు. చిన్నపాటి వర్షానికే మురికినీరు ఎక్కడికక్కడ నిల్వ ఉండి, కంపు వాసన రావడంతో పాటు దోమలు, ఈగలు చేరి అనారోగ్యాల బారినపడే […]
దిశ, ఖానాపూర్: ఎమ్మెల్యే రేఖానాయక్‌కు చేదు అనుభవం ఎదురైంది. నిర్మల్ జిల్లా కడం మండలంలోని పలు గ్రామాల్లో బుధవారం బతుకమ్మ చీరలు పంపిణీ చేయడానికి వచ్చిన ఎమ్మెల్యేను కొండుకూరు గ్రామంలో ఇందిరమ్మ కాలనీ మహిళలు అడ్డుకున్నారు. డ్రైనేజీ సమస్య పరిష్కరించాలని కారును అడ్డగించి నిరసన తెలిపారు. డ్రైనేజీ సమస్యను తట్టుకోలేకపోతున్నామని, సమస్య పరిష్కరించాల్సిందే అని నిలదీశారు. చిన్నపాటి వర్షానికే మురికినీరు ఎక్కడికక్కడ నిల్వ ఉండి, కంపు వాసన రావడంతో పాటు దోమలు, ఈగలు చేరి అనారోగ్యాల బారినపడే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇప్పటికే ఈ డ్రైనేజీ మూలానా అనేకమంది ఇందిరమ్మ కాలనీవాసులు రోగాల బారినపడ్డారని వాపోయారు. ‘మాకు బతుకమ్మ చీరలు వద్దు. ముందు మా సమస్యలు పరిష్కరించండి.’ అని ఎమ్మెల్యేను ప్రశ్నించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకోవడంతో మహిళలు ఆందోళన విరమించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. సమస్య గురించి సర్పంచ్, అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి ఇందిరమ్మ కాలనీలోని డ్రైనేజీ సమస్య పరిష్కరించాలని కోరారు.