నోటీసులు ఇచ్చింది కూల్చివేతకా.. లేక నిర్మాణ పనులకా..?

ప్రభుత్వ భూముల్లో అక్రమ వెంచర్లు.. ఇండ్ల నిర్మాణాలు చేస్తే హైదరాబాద్ హైడ్రా తరహాలో అక్రమ నిర్మాణాలను కూల్చేస్తామని హెచ్చరిస్తూ మీడియా ముందు చెప్పిన రెవెన్యూ అధికారులు ఆ స్థాయిలో చర్చలు తీసుకోవడంలో పూర్తిగా విఫలమయ్యారు.

Update: 2024-11-26 04:16 GMT

దిశ, ఆసిఫాబాద్ : ప్రభుత్వ భూముల్లో అక్రమ వెంచర్లు.. ఇండ్ల నిర్మాణాలు చేస్తే హైదరాబాద్ హైడ్రా తరహాలో అక్రమ నిర్మాణాలను కూల్చేస్తామని హెచ్చరిస్తూ మీడియా ముందు చెప్పిన రెవెన్యూ అధికారులు ఆ స్థాయిలో చర్చలు తీసుకోవడంలో పూర్తిగా విఫలమయ్యారు. టీఆర్ నగర్ లో సుమారు ఎకరం పైగా ప్రభుత్వ భూమి కబ్జా అయ్యింది. బహిరంగ మార్కెట్లో దీని విలువ కోటి పైనే ఉండొచ్చని తెలుస్తోంది.

ఇంత విలువైన భూమిని కబ్జా చేసి.. అధికార పార్టీ పేరుతో యథేచ్ఛగా ఇండ్ల నిర్మాణం చేస్తుంటే రెవెన్యూ అధికారులు పట్టనట్లు వ్యవహరిస్తుండటంతో సదరు అక్రమార్కులకు కూల్చివేతకు నోటీసులు ఇచ్చారా.. లేక ఇండ్ల నిర్మాణానికి అనుమతులు ఇచ్చారో తెలియకుండా ఉంది. గత రెండు రోజుల నుంచి ఈ విషయమై స్థానిక తహశీల్దార్ ను మీడియా సభ్యులు ఫోన్ లో వివరణ కోరగా పొంతనలేని సమాధానం ఇస్తూ, ఆర్డీవోని అడగాలని చెప్పారు. ఆర్డీవో ను అడగగా నోటీసులు ఇచ్చిన తహశీల్దార్ ను అడగాలని తెలిపారు. దీంతో స్థానిక రెవెన్యూ అధికారుల పనితీరు పై అనేక అనుమానాలు.. ఆరోపణలు వస్తున్నాయి.


Similar News