రూ. 6 వేలు తీసుకుండ్రు.. వాళ్లు కేసీఆర్‌కే ఓటేస్తారా.. కేసీఆర్‌కు మరో టెన్షన్..!
దిశ, కమలాపూర్: మేము ప్రజలము కాదా? మేము ఓటు వేయకుండానే కేసీఆర్, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, వార్డు మెంబర్లు గెలిచారా ?మా ఓట్లు ఎందుకు వద్దంటారు అంటూ హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలో బుధవారం పలు వార్డులకు సంబంధించిన మహిళలు నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మా చుట్టుపక్కల ఉన్న వాళ్లందరికీ నాయకులు ఓటుకు ఆరువేల రూపాయల చొప్పున నిర్ణయించి, డబ్బులు పంపిణీ చేశారంటూ ఆందోళనకు దిగారు. మాకు ఎందుకు ఇవ్వలేదు అని ప్రశ్నిస్తే ఇన్‌చార్జీలు, […]
దిశ, కమలాపూర్: మేము ప్రజలము కాదా? మేము ఓటు వేయకుండానే కేసీఆర్, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, వార్డు మెంబర్లు గెలిచారా ?మా ఓట్లు ఎందుకు వద్దంటారు అంటూ హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలో బుధవారం పలు వార్డులకు సంబంధించిన మహిళలు నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మా చుట్టుపక్కల ఉన్న వాళ్లందరికీ నాయకులు ఓటుకు ఆరువేల రూపాయల చొప్పున నిర్ణయించి, డబ్బులు పంపిణీ చేశారంటూ ఆందోళనకు దిగారు. మాకు ఎందుకు ఇవ్వలేదు అని ప్రశ్నిస్తే ఇన్‌చార్జీలు, నాయకులు నిర్ణయించినట్లుగా ఇస్తున్నామని, ఒకవేళ మీకు డబ్బులు కావాలంటే ఓటు వేసి వచ్చిన తర్వాత మాకే ఓటు వేశారని రుజువు చూపిస్తే డబ్బులు ఇస్తామని సమాధానం చెబుతున్నారని మహిళలు మండిపడ్డారు. మేము డబ్బులు అడిగామా? ఎందుకు ప్రమాణం చేయాలంటూ, మా ఓటు ఎందుకు వద్దంటున్నారు అని, అందరికీ కేసీఆర్ ప్రమాణం చేయించుకునే డబ్బులు ఇచ్చారా? కేసీఆర్ చెప్పిండ్రా? అంటూ వారు ప్రశ్నించారు. ఆరువేల రూపాయలు తీసుకున్న వారంతా కేసీఆర్‌కే ఓటేస్తామని చూపించగలరా? అంటూ టీఆర్ఎస్ నేతలకు కొత్త టెన్షన్ పెట్టారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.