ఎందుకు పుట్టించావ్..? డాక్టర్‌పై యువతి కేసు
దిశ, ఫీచర్స్ : తను కడుపులో ఉండగా.. తల్లికి వైద్యం చేసిన డాక్టర్‌పై ఓ యువతి 20 ఏళ్ల తర్వాత దావా వేసింది. నిజానికి తాను పుట్టి ఉండకూడదని, అందుకు కారణమైన వైద్యుడి నుంచి భారీగా నష్టపరిహారాన్ని కోరింది. యూకేలో స్టార్ షోజంపర్ అయిన ఎవీ టూంబ్స్.. ‘స్పినా బిఫిడా’ అనే సమస్యతో జన్మించింది. వెన్నెముక లోపానికి సంబంధించిన ఈ ప్రాబ్లెమ్ వల్ల ఒక్కోసారి తన శరీరాన్ని 24 గంటల పాటు ట్యూబ్స్‌కు కనెక్ట్ చేసి ఉంచాల్సిన […]
దిశ, ఫీచర్స్ : తను కడుపులో ఉండగా.. తల్లికి వైద్యం చేసిన డాక్టర్‌పై ఓ యువతి 20 ఏళ్ల తర్వాత దావా వేసింది. నిజానికి తాను పుట్టి ఉండకూడదని, అందుకు కారణమైన వైద్యుడి నుంచి భారీగా నష్టపరిహారాన్ని కోరింది. యూకేలో స్టార్ షోజంపర్ అయిన ఎవీ టూంబ్స్.. ‘స్పినా బిఫిడా’ అనే సమస్యతో జన్మించింది. వెన్నెముక లోపానికి సంబంధించిన ఈ ప్రాబ్లెమ్ వల్ల ఒక్కోసారి తన శరీరాన్ని 24 గంటల పాటు ట్యూబ్స్‌కు కనెక్ట్ చేసి ఉంచాల్సిన దుర్భర పరిస్థితిని అనుభవిస్తోంది. ఇంతకీ ఆ డాక్టర్ చేసిన తప్పేంటి?
ప్రెగ్నెన్సీకి ముందు ఆమె తల్లి హెల్త్ కండిషన్ దృష్ట్యా కీలకమైన సప్లిమెంట్లను తీసుకోవాలని సలహా ఇవ్వడంలో డాక్టర్ ఫిలిప్ విఫలమయ్యాడని యూకే యువతి కోర్టును ఆశ్రయించింది. ప్రస్తుతం 20 ఏళ్ల వయసున్న తను ‘స్పినా బిఫిడా’ సమస్యతో బాధపడుతోంది. అయితే తాను కడుపులో ఉన్నప్పుడు ఈ ప్రమాదాన్ని తగ్గించేందుకు ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్లు తీసుకోవాలని తన తల్లికి చెప్పినట్లయితే ఇలా జరిగి ఉండేది కాదని పేర్కొంది. ముందే తెలిస్తే తను ప్రెగ్నెన్సీ వాయిదా వేసుకునేదని, అప్పుడు తాను పుట్టకపోయేదాన్నని తెలిపింది. తన తల్లి సైతం డాక్టర్ మిచెల్ సరైన సలహా ఇచ్చి ఉంటే, గర్భం దాల్చాలనే ఆలోచనను విరమించుకునేదాన్నని గతంలోనే కోర్టుకు తెలిపింది. అంతేకాదు మంచి ఆహారం తీసుకుంటే ఫోలిక్ యాసిడ్ తీసుకోవాల్సిన అవసరం లేదని ఆ టైమ్‌లో సదరు డాక్టర్ చెప్పినట్లు న్యాయమూర్తికి చెప్పింది.
ఈ విషయంలో ఎవీ పక్షాన నిలబడ్డ లండన్‌లోని న్యాయస్థానం.. సదరు డాక్టర్ నుంచి భారీ పరిహారాన్ని పొందే హక్కు కల్పించింది. ఆమె జీవితకాల సంరక్షణ అవసరాలకు అయ్యే ఖర్చును భరించాల్సి ఉంటుంది కాబట్టి పెద్ద మొత్తంలోనే చెల్లించాల్సి ఉంటుందని ఎవీ లాయర్లు తెలిపారు. కాగా ఇది సంచలనాత్మక తీర్పుగా పరిగణించబడింది. తీవ్ర ఆరోగ్య పరిస్థితుల్లో ఓ తల్లి శిశువుకు జన్మనివ్వడం సరికాదని, ఈ విషయంలో గర్భధారణకు ముందే సలహా ఇవ్వాలని బాధ్యత డాక్టర్‌కు ఉంటుందని స్పష్టం చేసింది.
చలికాలంలో ఈ ఆకు కూర తింటే ఇక అంతే సంగతి !
https://www.instagram.com/p/CWbQ3xHISVp/?utm_source=ig_embed&ig_rid=4c5d8253-2358-4a93-bd1b-44c7193378bd