Dalit Student : ప్రిన్సిపల్ కులం పేరుతో దూషించారు.. పోలీసులకు దళిత విద్యార్థి ఫిర్యాదు
దిశ, నేషనల్ బ్యూరో : ఢిల్లీ యూనివర్సిటీ(Delhi University) పరిధిలోని షహీద్ భగత్ సింగ్ కాలేజీ(Shaheed Bhagat Singh College)లో డిగ్రీ చదువుతున్న దళిత విద్యార్థి(Dalit student) సుమిత్ చౌహాన్ సంచలన ఆరోపణలు చేశారు.
దిశ, నేషనల్ బ్యూరో : ఢిల్లీ యూనివర్సిటీ(Delhi University) పరిధిలోని షహీద్ భగత్ సింగ్ కాలేజీ(Shaheed Bhagat Singh College)లో డిగ్రీ చదువుతున్న దళిత విద్యార్థి(Dalit student) సుమిత్ చౌహాన్ సంచలన ఆరోపణలు చేశారు. కాలేజీ ప్రిన్సిపల్ అరుణ్ కుమార్ అత్రి తనను కులం పేరుతో దూషించడంతో పాటు చెంపదెబ్బ కొట్టి అవమానించారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పలు విద్యార్థి సంఘాలకు చెందిన వందలాది మంది విద్యార్థులు సుమిత్‌కు మద్దతుగా సోమవారం షహీద్ భగత్ సింగ్ కాలేజీ వద్ద నిరసనకు దిగారు. దళిత విద్యార్థితో అమానుషంగా ప్రవర్తించినందుకు ప్రిన్సిపల్ అరుణ్ కుమార్ అత్రి వెంటనే రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు.
‘‘ప్రిన్సిపల్ తీరు వల్ల నేను మానసిక వేదనకు లోనవుతున్నాను. నాకు ఏదైనా జరిగితే ప్రిన్సిపల్ అరుణ్ కుమార్, ప్రొఫెసర్ నమన్ జైన్, సౌరవ్, ఆశిష్‌లే బాధ్యులు’’ అని విద్యార్థి సుమిత్ తెలిపారు. ప్రిన్సిపల్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఢిల్లీ యూనివర్సిటీి వీసీని కోరారు.ప్రిన్సిపల్ అరుణ్ తీరును, వ్యవహార శైలిని వ్యతిరేకిస్తూ గతంలో పలువురు కాలేజీ బోధనా సిబ్బంది కూడా ఆరోపణలు చేసినట్లు తెలిసింది. ఇక ఈ ఆరోపణలను ప్రిన్సిపల్ అరుణ్ కుమార్ అత్రి ఖండించారు. ‘‘ప్రొఫెసర్ రాకేశ్ కుమార్ కూడా దళిత వర్గానికి చెందినవారే. ఆయనే సుమిత్ చౌహాన్‌ను రెచ్చగొట్టి నాకు వ్యతిరేకంగా ఇదంతా చేయిస్తున్నారు’’ అని ఆయన ఆరోపించారు.