కుటుంబ నియంత్రణ ఆపరేషన్ వికటించి మహిళా సర్పంచ్ మృతి

దిశ, వెబ్ డెస్క్ : నారాయణపేట జిల్లాలోని దామరగిద్దలో విషాదం చోటు చేసుకుంది. దామరగిద్ద ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యం వికటించి మహిళా సర్పంచ్ లక్ష్మి మృతి చెందిన ఘటన ఆ గ్రామంలో కలకలం రేపుతోంది. కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసిన కొద్దిసేపటికే లక్ష్మి ఆరోగ్యం విషమించడంతో జిల్లా ఆసుపత్రికి తరలించగా మృతి చెందారు. డాక్టర్ల నిర్లక్ష్యంతోనే తన భార్య చనిపోయిందని సర్పంచ్ భర్త ఆరోపించారు. ఈ రోజు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసిన మహిళలను నేలపై […]

Update: 2021-04-06 07:07 GMT

దిశ, వెబ్ డెస్క్ : నారాయణపేట జిల్లాలోని దామరగిద్దలో విషాదం చోటు చేసుకుంది. దామరగిద్ద ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యం వికటించి మహిళా సర్పంచ్ లక్ష్మి మృతి చెందిన ఘటన ఆ గ్రామంలో కలకలం రేపుతోంది. కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసిన కొద్దిసేపటికే లక్ష్మి ఆరోగ్యం విషమించడంతో జిల్లా ఆసుపత్రికి తరలించగా మృతి చెందారు.

డాక్టర్ల నిర్లక్ష్యంతోనే తన భార్య చనిపోయిందని సర్పంచ్ భర్త ఆరోపించారు. ఈ రోజు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసిన మహిళలను నేలపై పడుకోబెట్టారని వెల్లడించారు. అయితే, ఆపరేషన్‌కు ముందు జరిగే ఇన్ సీజర్ ప్రక్రియ తర్వాత ఫిట్స్ రావడంతో ఆమె మృతి చెందినట్టు డాక్టర్ రవీందర్ తెలిపారు.

 

Tags:    

Similar News