అండర్‌వేర్‌ను మాస్క్‌గా ధరించిన మహిళ.. వీడియో వైరల్

దిశ, ఫీచర్స్ : కొవిడ్ మహమ్మారి కట్టడికి వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ మాస్క్ ధరించడం తప్పనిసరి అని ప్రభుత్వాలు ప్రకటిస్తూనే ఉన్నాయి. ఇక వ్యాక్సిన్ తీసుకున్నా, తీసుకోకపోయినా మాస్క్ మస్ట్ అంటూ ప్రపంచ దేశాల ప్రభుత్వాలన్నీ ప్రచారం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. కరోనాపై అవగాహన నిమిత్తం పలు సంస్థలు మాస్క్ లేనిదే తమ ఆఫీసు‌లోకి ఎంట్రీ ఉండదని బోర్డులు కూడా పెడుతున్నాయి. దీంతో రోజువారి జీవితంలో భాగంగా మాస్క్ ధరించడం కామన్ అయింది. కానీ కొందరు మాత్రం నిర్లక్ష్యం […]

Update: 2021-03-02 01:42 GMT

దిశ, ఫీచర్స్ : కొవిడ్ మహమ్మారి కట్టడికి వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ మాస్క్ ధరించడం తప్పనిసరి అని ప్రభుత్వాలు ప్రకటిస్తూనే ఉన్నాయి. ఇక వ్యాక్సిన్ తీసుకున్నా, తీసుకోకపోయినా మాస్క్ మస్ట్ అంటూ ప్రపంచ దేశాల ప్రభుత్వాలన్నీ ప్రచారం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. కరోనాపై అవగాహన నిమిత్తం పలు సంస్థలు మాస్క్ లేనిదే తమ ఆఫీసు‌లోకి ఎంట్రీ ఉండదని బోర్డులు కూడా పెడుతున్నాయి. దీంతో రోజువారి జీవితంలో భాగంగా మాస్క్ ధరించడం కామన్ అయింది. కానీ కొందరు మాత్రం నిర్లక్ష్యం వహిస్తున్నారు. మాస్క్ ధరించకుండానే జనాల్లో తిరుగుతున్నారు. ఈ నేపథ్యంలో దక్షిణాఫ్రికాలోని ఓ సూపర్ మార్కెట్‌‌‌లోకి మాస్క్ ధరించకుండా వచ్చిన మహిళను అక్కడి సిబ్బంది హెచ్చరించారు. దీంతో ఆమె చేసిన పని అక్కడున్నవారిని షాక్‌కు గురిచేసింది. ఇంతకీ ఆమె ఏం చేసిందంటే..

https://twitter.com/YB_JLN/status/1364253718904979462?s=20

సూపర్ మార్కెట్‌లో షాపింగ్ చేసేందుకు వచ్చిన కస్టమర్లను సీసీ టీవీల ఆధారంగా మాల్ స్టాఫ్ పరిశీలించగా.. ఓ మహిళ మాస్క్ లేకుండా మార్కెట్‌లో తిరగడాన్ని గుర్తించారు. ఈ క్రమంలో సదరు మహిళ బిల్లింగ్ కోసం కౌంటర్ వద్దకు వస్తుండగా.. సూపర్ మార్కెట్ స్టాఫ్ ఒకరు మాస్క్ లేకుండా సామగ్రి అమ్మబోమని చెప్పడంతో ఆ మహిళ తన అండర్‌వేర్‌ను మాస్క్‌గా ధరించి అందరినీ షాక్‌కు గురి చేసింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుండగా, ఆమె చేసిన పనికి నెటిజన్లు మండిపడుతున్నారు. ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించిన ఆమెను శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా, పబ్లిక్‌లో ఉన్నప్పుడు ఫేస్ మాస్క్ ధరించని వారు క్రిమినల్ నేరం చేసినట్లేనని గతేడాది డిసెంబర్‌లోనే దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫొస ప్రకటించారు. అయినా ఆ దేశవాసుల్లో కొందరు మాస్క్ ధరించడం లేదు.

Tags:    

Similar News