ధ్రువాలు దాటిన ధీరత్వం

న్యూఢిల్లీ: అమెరికా పశ్చిమ తీరంలోని శాన్‌ఫ్రాన్సిస్కో నుంచి భారత్‌లోని బెంగళూరుకు ఉన్న విమాన మార్గం ప్రపంచంలోనే 10 అత్యధిక సుదూర మార్గాల్లో ఒకటి. ఒక్క స్టాప్ లేకుండా సుమారు 16వేల కిలోమీటర్ల ప్రయాణం. పైగా ఉత్తర ధ్రువం మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. కంపాస్ 180 డిగ్రీలు మారుతుంది. ఇది వరకు ఎయిర్ ఇండియా పైలట్లు ఈ రూట్‌లో విమానాన్ని ఎగిరించారు. మహిళా పైలట్లు ఈ సాహసోపేత మార్గంలో నడిపించలేదు. కానీ, నలుగురు మహిళా కెప్టెన్లు జోయా అగర్వాల్, […]

Update: 2021-01-11 05:34 GMT

న్యూఢిల్లీ: అమెరికా పశ్చిమ తీరంలోని శాన్‌ఫ్రాన్సిస్కో నుంచి భారత్‌లోని బెంగళూరుకు ఉన్న విమాన మార్గం ప్రపంచంలోనే 10 అత్యధిక సుదూర మార్గాల్లో ఒకటి. ఒక్క స్టాప్ లేకుండా సుమారు 16వేల కిలోమీటర్ల ప్రయాణం. పైగా ఉత్తర ధ్రువం మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. కంపాస్ 180 డిగ్రీలు మారుతుంది. ఇది వరకు ఎయిర్ ఇండియా పైలట్లు ఈ రూట్‌లో విమానాన్ని ఎగిరించారు. మహిళా పైలట్లు ఈ సాహసోపేత మార్గంలో నడిపించలేదు. కానీ, నలుగురు మహిళా కెప్టెన్లు జోయా అగర్వాల్, పాపాగిరి తన్మయ్, అకాన్ష సోనావారె, శివాని మన్హస్‌లు ఈ చాలెంజ్‌ను విజయవంతంగా పూర్తి చేసి చరిత్ర సృష్టించారు.

238 మంది ప్రయాణికులతో శాన్‌ఫ్రాన్సిస్కో నుంచి శనివారం రాత్రి 8.30 గంటలకు బయల్దేరి బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో సోమవారం ఉదయం 3.07 గంటలకు చేరింది. ఉత్తర ధ్రువం మీదుగా ప్రయాణించడమే కాదు, ప్రపంచంలోనే అత్యంత దూరమైన మార్గాల్లో ఒకటైన ఈ దారిలో విమానాన్ని నడిపి చరిత్ర సృష్టించామని కెప్టెన్ జోయా అగర్వాల్ తెలిపారు. ఈ ప్రయాణాన్ని విజయవంతంగా ముగించడంపై సంతోషంగా, గర్వంగా ఉన్నదని అన్నారు. ఈ రూట్‌లో ప్రయాణించడం ద్వారా ఇంధనం ఖర్చు, సమయం, కాలుష్యాన్ని తగ్గించవచ్చునని సిబ్బంది తెలిపారు. సుమారు రెండు వేల నుంచి పదివేల కిలోల ఇంధనాన్ని ఆదా చేశామని కెప్టెన్ పాపాగిరి తన్మయ్ వివరించారు. మహిళా పైలట్లు చరిత్ర సృష్టించారని, ఈ సక్సెస్‌ను సెలబ్రేట్ చేసుకోవాలని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి హర్దిప్ సింగ్ పురి ట్వీట్ చేశారు.

Tags:    

Similar News