మద్యం మత్తులో తల్లి.. బిడ్డను ఎత్తుకెళ్లి ఆ పని చేసిన మహిళ.. పోలీసులు ఏంచేశారంటే..?
దిశ, శేరిలింగంపల్లి: రోడ్డుపై కన్నతల్లి పక్కనే ఏడుస్తున్న ఐదురోజుల పసిబిడ్డను చూసిన ఓ మహిళ తల్లికి తెలియకుండా ఎత్తుకెళ్లి స్నానం చేయించి, పాలు తాగించి పోలీసులకు అప్పగించింది. ఈ విచిత్రమైన సంఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే… నగరంలోని దోమలగూడ ప్రాంతానికి చెందిన వడ్డె జ్యోతి మంగళవారం మధ్యాహ్నం గంగారంలోని రోడ్డు పక్కన ఉండే టిఫిన్ సెంటర్‌కు తన ఐదు రోజుల పసిబిడ్డతో కలిసి వెళ్లింది. ఆకలితో అలమటిస్తున్న ఆమెను చూసిన […]
దిశ, శేరిలింగంపల్లి: రోడ్డుపై కన్నతల్లి పక్కనే ఏడుస్తున్న ఐదురోజుల పసిబిడ్డను చూసిన ఓ మహిళ తల్లికి తెలియకుండా ఎత్తుకెళ్లి స్నానం చేయించి, పాలు తాగించి పోలీసులకు అప్పగించింది. ఈ విచిత్రమైన సంఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే… నగరంలోని దోమలగూడ ప్రాంతానికి చెందిన వడ్డె జ్యోతి మంగళవారం మధ్యాహ్నం గంగారంలోని రోడ్డు పక్కన ఉండే టిఫిన్ సెంటర్‌కు తన ఐదు రోజుల పసిబిడ్డతో కలిసి వెళ్లింది. ఆకలితో అలమటిస్తున్న ఆమెను చూసిన ఓ మహిళ ఆమెకు టిఫిన్ పెట్టించడంతో పాటు కాళ్లకు చెప్పులు కొని ఇచ్చింది. ఆ తర్వాత బిడ్డను తీసుకుని వెళ్లిపోయింది.
ఎంతసేపటికీ సదరు మహిళ తిరిగి రాకపోవడంతో జ్యోతి, భర్త మల్లేష్ లు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కిడ్నాప్ గా భావించి విచారణ ప్రారంభించారు. కాగా అమీన్ పూర్ కు చెందిన నందిని అనే మహిళ సదరు బిడ్డను ఇంటికి తీసుకువెళ్లి స్నానం చేయించి, ఆకలి తీర్చి పోలీసులకు అప్పగించింది. తాను బిడ్డను గమనించిన సమయంలో జ్యోతి మద్యం మత్తులో పడి ఉందని, బాబు ఏడుస్తూ ఉండటంతో తనకు అనుమానం కలిగి అలా చేసినట్లు నందిని పోలీసులకు తెలిపింది. పసిబిడ్డ విషయంలో జాగ్రత్త ధోరణితో ఆలోచించి నందిని వ్యవహరించిన తీరును పోలీసులతో పాటు పలువురు ప్రశంసిస్తున్నారు.