108 వాహన సిబ్బంది చేసిన పనికి.. వెళ్లువెత్తిన అభినందనలు
దిశ, గూడూరు : 108 వాహనంలో మహిళ పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని గూడూరు మండలంలోని నెలవంచ గ్రామానికి చెందిన కత్తుల సుశీల అనే గిరిజన మహిళా పురిటి నొప్పులతో బాధ పడుతుడడంతో గ్రామస్తులు , కుటుంబ సభ్యులు 108 వాహనానికి సమాచారమందించారు. ఆసుపత్రికి తరలించే క్రమంలో నొప్పులు ఎక్కువగా రావడంతో 108 వాహనం లోనే ప్రసవించి, పండంటి ఆడబిడ్డకు జన్మను ఇచ్చింది. క్షేమంగా తల్లి ,బిడ్డలను మహబూబాబాద్ జిల్లా […]
దిశ, గూడూరు : 108 వాహనంలో మహిళ పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని గూడూరు మండలంలోని నెలవంచ గ్రామానికి చెందిన కత్తుల సుశీల అనే గిరిజన మహిళా పురిటి నొప్పులతో బాధ పడుతుడడంతో గ్రామస్తులు , కుటుంబ సభ్యులు 108 వాహనానికి సమాచారమందించారు. ఆసుపత్రికి తరలించే క్రమంలో నొప్పులు ఎక్కువగా రావడంతో 108 వాహనం లోనే ప్రసవించి, పండంటి ఆడబిడ్డకు జన్మను ఇచ్చింది. క్షేమంగా తల్లి ,బిడ్డలను మహబూబాబాద్ జిల్లా ఆసుపత్రికి తీసుకువెళ్ళారు. సమయ స్ఫూర్తి తో చకాచక్యంగా వ్యవహరించిన 108 సిబ్బంది ఈ.ఎమ్.టీ. కవిత, పైలట్ ప్రశాంత్‌ను డాక్టర్లు, వారి కుటుంబ సభ్యులు అభినందించారు.