మన్యంలో బాధాకర సంఘటన
దిశ. కొత్తగూడెం: మన్యంలో మరో బాధాకర సంఘటన చోటు చేసుకుంది. రహదారి సౌకర్యం లేక, అంబులెన్సు రాలేక అడవిలోనే మహిళ ప్రసవంచింది. వివరాల్లోకి వెళితే.. చర్ల మండలంలోని కీకారణ్య మైన ఎర్రంపాడు కి చెందిన నిండు గర్భిణి కొవ్వాసి ఐతేకి పురిటి నొప్పులు రావడంతో కాలినడకతోనే ఎర్రంపాడు నుంచి చెన్నారం వరకు భర్త మాసా, ఆశ కార్యకర్త సోమమ్మ కలసి జార్జ్ లో మోసుకు వస్తుండగా మార్గమధ్యంలోనే మగబిడ్డకు జన్మనిచ్చింది. గ్రామ యువకులు 108 వాహనానికి సమాచారం […]
దిశ. కొత్తగూడెం: మన్యంలో మరో బాధాకర సంఘటన చోటు చేసుకుంది. రహదారి సౌకర్యం లేక, అంబులెన్సు రాలేక అడవిలోనే మహిళ ప్రసవంచింది. వివరాల్లోకి వెళితే.. చర్ల మండలంలోని కీకారణ్య మైన ఎర్రంపాడు కి చెందిన నిండు గర్భిణి కొవ్వాసి ఐతేకి పురిటి నొప్పులు రావడంతో కాలినడకతోనే ఎర్రంపాడు నుంచి చెన్నారం వరకు భర్త మాసా, ఆశ కార్యకర్త సోమమ్మ కలసి జార్జ్ లో మోసుకు వస్తుండగా మార్గమధ్యంలోనే మగబిడ్డకు జన్మనిచ్చింది. గ్రామ యువకులు 108 వాహనానికి సమాచారం ఇవ్వగా ప్రథమ చికిత్స అనంతరం 108 వాహనంలో సత్యనారాయణపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నారని వైద్యులు చెప్పారు.