ఈ పెళ్లిలో అన్నీ ట్విస్టులే.. బై మిస్టేక్ అన్నతోనే పెళ్లైంది!!
దిశ, వెబ్ డెస్క్: వివాహ వేదిక .. మరో కొద్దీ సేపట్లో అంగరంగ వైభవంగా వివాహం జరుగనుంది.. కొడుకు కోసం ఎంతో అందమైన యువతిని వెతికామని తల్లిదండ్రులు మురిసిపోతున్నారు.. పెళ్లి కూతురు కోసం అందరు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. అంతలోనే పెళ్లి కూతురు రానే వచ్చింది… అత్తగారి కాళ్ల మీద పడి ఆశీర్వాదం తీసుకుందామని వంగింది.. అప్పుడే అత్తగారికి కోడలు చేతిపై పుట్టుమచ్చ కనిపించింది. అంతే… వెంటనే కోడల్ని పట్టుకుని గావురుగావురామని ఏడవడం మొదలుపెట్టింది. అసలు అక్కడ […]
దిశ, వెబ్ డెస్క్: వివాహ వేదిక .. మరో కొద్దీ సేపట్లో అంగరంగ వైభవంగా వివాహం జరుగనుంది.. కొడుకు కోసం ఎంతో అందమైన యువతిని వెతికామని తల్లిదండ్రులు మురిసిపోతున్నారు.. పెళ్లి కూతురు కోసం అందరు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. అంతలోనే పెళ్లి కూతురు రానే వచ్చింది… అత్తగారి కాళ్ల మీద పడి ఆశీర్వాదం తీసుకుందామని వంగింది.. అప్పుడే అత్తగారికి కోడలు చేతిపై పుట్టుమచ్చ కనిపించింది. అంతే… వెంటనే కోడల్ని పట్టుకుని గావురుగావురామని ఏడవడం మొదలుపెట్టింది. అసలు అక్కడ ఏం జరుగుతుందో తెలియని వారందరు సందిగ్ధంలో పడ్డారు.. పెళ్లి కూతురు చిన్నప్పుడు తప్పిపోయిన తన కూతురని చెప్పడంతో ఒక్కసారిగా బంధువులందరూ షాకయ్యారు. ఈ వింత సంఘటన చైనాలో చోటుచేసుకుంది.
చైనాలోని జియాంగ్సు ప్రావియన్స్లో ఉండే ఒక మహిళ కూతురు రెండేళ్ల వయస్సులో తప్పిపోయింది. ఆమెకోసం వెతికి వెతికి అలసిపోయిన మహిళ కుటుంబ సభ్యులు చిన్నారి గురుంచి మర్చిపోయారు. ఇకపోతే ఇరవై ఏళ్ళ తర్వాత తన కొడుకు పెళ్లి చేయడానికి సిద్ధపడ్డ మహిళ.. కాబోయే కోడలి చేతిపై పుట్టుమచ్చను గుర్తు పట్టింది. తానే చిన్నప్పుడు తప్పిపోయిన కూతురని గుర్తించింది. వెంటనే ఆ విషయాన్ని కోడలికి వివరించింది. ఆ యువతి తనను పెంచిన తల్లిదండ్రులను అడగగా .. రోడ్డు మీద దొరికితే పెంచుకున్నామని తెలిపారు. దీంతో కన్నతల్లిని చూసిన ఆ యువతి కన్నీటిపర్యంతమయ్యింది. ఇక తన సొంత అన్నను పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డానంటూ ఏడవసాగింది. దీంతో తల్లి పెళ్లి విషయంలో ఏ ఇబ్బంది లేదని , అతను తన సొంత కొడుకు కాదని, నువ్వు తప్పిపోయాక అతన్ని పెంచుకున్నామని తెలిపింది. ఒకే కడుపున జన్మించకపోవడం వలన ఈ పెళ్లికి ఎలాంటి అడ్డంకులు రావని పెళ్లి కూతురికి నచ్చజెప్పి పెళ్లి ఘనంగా జరిపించారు. ఏది ఏమైనా ప్రపంచం చాలా చిన్నదాని ఈ ఘటన చూస్తే తెలుస్తుంది.