యువకుడి మోజులో అతడు.. ప్రియురాలిని అలా చేసి జంప్

దిశ, వెబ్ డెస్క్: వారిద్దరూ ఎంతోకాలంగా ప్రేమించుకొన్నారు. చెట్టాపట్టాలేసుకుని పార్కులు, పబ్ లు అన్ని తిరిగారు, త్వరలోనే పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు.. అంతలోనే ప్రియుడు ప్రమాదంలో మృతిచెందాడని ఫోన్ వచ్చింది. ఆ విషయం తెలుసుకున్న ప్రియురాలు గుండె ముక్కలయింది. అతని జ్ఞాపకాలతోనే బతుకుతూ వస్తుంది.. అయితే కొన్నేళ్ల తర్వాత అతను సజీవంగా ఉండడం చూసి ఆశ్చర్యపోతుంది.  ఇదేదో సినిమా కథలా ఉందేంటి..? అనుకుంటున్నారా? అవును ఇది ‘రాజా రాణి’ చిత్రంలోని నయనతార- జై ల స్టోరీ. అయితే […]

Update: 2021-05-03 02:47 GMT

దిశ, వెబ్ డెస్క్: వారిద్దరూ ఎంతోకాలంగా ప్రేమించుకొన్నారు. చెట్టాపట్టాలేసుకుని పార్కులు, పబ్ లు అన్ని తిరిగారు, త్వరలోనే పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు.. అంతలోనే ప్రియుడు ప్రమాదంలో మృతిచెందాడని ఫోన్ వచ్చింది. ఆ విషయం తెలుసుకున్న ప్రియురాలు గుండె ముక్కలయింది. అతని జ్ఞాపకాలతోనే బతుకుతూ వస్తుంది.. అయితే కొన్నేళ్ల తర్వాత అతను సజీవంగా ఉండడం చూసి ఆశ్చర్యపోతుంది. ఇదేదో సినిమా కథలా ఉందేంటి..? అనుకుంటున్నారా? అవును ఇది ‘రాజా రాణి’ చిత్రంలోని నయనతార- జై ల స్టోరీ. అయితే సినిమాలు కూడా కొన్ని వాస్తవ కథల ఆధారంగానే తెరకెక్కుతాయని ఈ స్టోరీ చదివితే తెలుస్తుంది. అచ్చం ‘రాజా రాణి’ లాంటి ఘటనే ఒక యువతికి ఎదురయ్యింది. ఏడేళ్ల క్రితం చనిపోయాడనుకున్న ప్రియుడు.. తన గే బాయ్ ఫ్రెండ్ తో కలిసి ఫేస్‌బుక్‌ లో ప్రత్యక్షమయ్యాడు. ఇంతకీ అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం.

కె. జెవెల్ అనే యువతి తన 14వ ఏట ఒక యువకుడిని ప్రేమించింది. ఆరు నెలలు గడిచిన వారి రిలేషన్ లో ఒక చిన్న గొడవ.. ఆ గొడవ వలన వారిద్దరూ విడిపోయారు. ఆ తర్వాత ప్రియుడు ఫోన్ చేసి సారీ చెప్తాడేమో అని జెవెల్ ఎంతగానో ఎదురుచూసింది. కానీ అటునుండి ఒక ఫోన్ కాదు కదా కనీసం మెస్సేజ్ కూడా రాలేదు. ఈమె ఫోన్ చేసినా అటు నుండి స్పందన లేదు. అయితే అనుకోకుండా ఒక రోజు ఒక వ్యక్తి నుండి జెవెల్ కి కాల్ వచ్చింది. “నీ ప్రియుడికి ప్రమాదం జరిగింది.. గత కొన్ని రోజులు నుండి కోమాలో ఉండి అతను ఈరోజే చనిపోయాడు” అని చెప్పాడు. దీంతో జెవెల్ ఒక్కసారిగా కృంగిపోయింది. ప్రేమించినవాడు చనిపోయాడనుకొని అతని జ్ఞాపకాలతోనే ఏడేళ్లు కాలం గడిపింది.

అయితే నిజం ఎప్పటికైనా దాగదు అన్నట్లు రెండు రోజుల కిందట ప్రియుడు తన ‘గే’ బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి తీసుకున్న ఫొటోను ఫేస్‌బుక్‌లో చూసి షాకయ్యింది. అది చూడగానే ఆమెకు కన్నీళ్లు ఆగలేదు. దీంతో వెంటనే అతనికి మెస్సేజ్ చేసింది. ‘‘నీ స్టోరీ చూశాను. గత ఏడేళ్లుగా నిన్నే తలచుకుంటున్నా.. నీన్నే ప్రేమిస్తున్నా. దయచేసి నాకు సమాధానం చెప్పగలవు’’ అని మెసేజ్ పంపింది. అయితే, ఇప్పటివరకు అతడు ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. అసలు తనకు ప్రియుడు ఎందుకు అబద్దం చెప్పాడు..?, బతికున్నా.. చనిపోయినట్లు ఎందుకు ఆమెకు ఫోన్ చేయించాడనేది కూడా తెలియరాలేదని జెవెల్ వివరించింది. కానీ ఎప్పటికైనా అతడిని కలిసి , తానెందుకు ఇలా చేశాడో తెలుసుకొంటానని తెలిపింది.

Tags:    

Similar News