విద్యుత్ షాక్ తో మహిళ మృతి
దిశ, నారాయణఖేడ్: విద్యుత్ షాక్‌తో ఓ వివాహిత మహిళ దుర్మరణం పాలైన ఘటన సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలంలో చోటుచేసుకుంది. అబ్బెన్ద గ్రామ ఉప సర్పంచ్ హనుమంతు భార్య దండే రేణుక దసరా పండుగ నేపథ్యంలో శనివారం ఉదయం ఇల్లు శుభ్రం చేసే పనిలో నిమగ్నమైంది. ఈ సమయంలో స్విచ్ బోర్డు వద్ద శుభ్రం చేస్తుండగా ఒక్కసారిగా విద్యుత్ షాక్ కు గురైంది. కాగా రేణుక ఉంటున్న ఇల్లు వ్యవసాయ క్షేత్రం సమీపంలో ఉందనీ… ఇటీవల కురిసిన […]
దిశ, నారాయణఖేడ్:
విద్యుత్ షాక్‌తో ఓ వివాహిత మహిళ దుర్మరణం పాలైన ఘటన సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలంలో చోటుచేసుకుంది. అబ్బెన్ద గ్రామ ఉప సర్పంచ్ హనుమంతు భార్య దండే రేణుక దసరా పండుగ నేపథ్యంలో శనివారం ఉదయం ఇల్లు శుభ్రం చేసే పనిలో నిమగ్నమైంది. ఈ సమయంలో స్విచ్ బోర్డు వద్ద శుభ్రం చేస్తుండగా ఒక్కసారిగా విద్యుత్ షాక్ కు గురైంది. కాగా రేణుక ఉంటున్న ఇల్లు వ్యవసాయ క్షేత్రం సమీపంలో ఉందనీ… ఇటీవల కురిసిన వర్షానికి ఇల్లు తడిగా మారిందని కుటుంబీకులు తెలిపారు. ఆమెను రక్షించే ప్రయత్నాన్ని భర్త హనుమంతు చేసినప్పటికీ ఫలించలేదు. అప్పటికే ఆమె మరణించిందని స్థానికులు తెలిపారు.