నగ్నంగా మహిళ సైకిల్ రైడ్.. ఎందుకంటే..?
దిశ, వెబ్‌డెస్క్: ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో ప్రతి ఏటా ‘నేక్డ్ సైకిల్ రైడ్’ను నిర్వహిస్తుంటారు. రోడ్డుపై కార్లు, మోటారిస్ట్‌ల నిర్లక్ష్యం కారణంగా సైక్లిస్ట్‌లకు జరిగే ప్రమాదాలను నివారించేందుకు గాను కనీసం ‘న్యూడ్’గా వెళితేనైనా వారికి కనిపిస్తామేమోననేది ఈ రైడ్ వెనకున్న ఉద్దేశ్యం. అదీగాక పర్యావరణహితం కోసం కార్ కల్చర్ నుంచి సైకిల్ రైడ్‌కు రావడంతో పాటు తమ శరీర సౌష్టవంతో బాధపడే చాలా మందికి ఆ ఫీలింగ్‌ను తొలగించేందుకు ఈ ‘న్యూడ్ సైకిల్ రైడ్’ తోడ్పడుతుంది. అయితే ప్రస్తుతం […]
దిశ, వెబ్‌డెస్క్: ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో ప్రతి ఏటా ‘నేక్డ్ సైకిల్ రైడ్’ను నిర్వహిస్తుంటారు. రోడ్డుపై కార్లు, మోటారిస్ట్‌ల నిర్లక్ష్యం కారణంగా సైక్లిస్ట్‌లకు జరిగే ప్రమాదాలను నివారించేందుకు గాను కనీసం ‘న్యూడ్’గా వెళితేనైనా వారికి కనిపిస్తామేమోననేది ఈ రైడ్ వెనకున్న ఉద్దేశ్యం. అదీగాక పర్యావరణహితం కోసం కార్ కల్చర్ నుంచి సైకిల్ రైడ్‌కు రావడంతో పాటు తమ శరీర సౌష్టవంతో బాధపడే చాలా మందికి ఆ ఫీలింగ్‌ను తొలగించేందుకు ఈ ‘న్యూడ్ సైకిల్ రైడ్’ తోడ్పడుతుంది. అయితే ప్రస్తుతం ఈ టాపిక్ ప్రస్తావనకు కారణం మాత్రం లండన్‌కు చెందిన కెర్రీ బార్నెస్. తను తాజాగా లండన్ వీధుల్లో ‘న్యూడ్ సైకిల్ రైడ్’ చేసి వార్తల్లో నిలిచింది. ఇంతకీ ఆమె ఎందుకలా చేసింది? ఆ రైడ్ వల్ల ఆమెకు కలిగే లాభమేంటి?
కరోనా వల్ల ప్రపంచం ఎన్నో మార్పులకు గురైన విషయం తెలిసిందే. కూలీల నుంచి బిజినెస్ టైకూన్‌ల వరకు అందరూ ఆర్థికంగా నష్టపోయారు. దానికితోడు చాలా మంది ‘మెంటల్’గానూ డిస్టర్బ్ అయ్యారు. ఈ నేపథ్యంలో కరోనాకు ముందు, ఆ తర్వాత ‘మెంటల్ హెల్త్’తో బాధపడే వారి సంఖ్య.. లండన్‌లోని కెర్రీ బార్నెస్ అనే యువతిని కలవరపెట్టింది. అంతకుముందుగా ఇదే సమస్యతో తన కజిన్ సూసైడ్ చేసుకోవడం, తన స్నేహితురాలు కూడా ఎన్నోసార్లు ఆత్మహత్యకు ప్రయత్నించడం వంటి అనుభవాలు తనను కుదురుగా ఉండనీయలేదు. అందుకే ‘మెంటల్ హెల్త్ చారిటీ’కి తనవంతుగా ఏదైనా సాయం చేయాలనుకుంది. ఈ మేరకు లండన్ వీధుల్లో 10 మైళ్ల వరకు నగ్నంగా సైకిల్ రైడ్ చేసి విరాళాలు సేకరించింది. ఆమె చేసిన సాహసానికి మొదట అందరూ నవ్వినా, తను చేస్తున్న మంచి పని గురించి తెలుసుకొని హ్యాట్సాఫ్ చెప్పారు.
‘విరాళాలు సేకరించేందుకు ఏం పని చేస్తే బాగుంటుందని నా స్నేహితులతో డిస్కస్ చేశాను. వాళ్లు సరాదాగా ‘నేక్డ్ బైక్ రైడ్’ చేయమన్నారు. వాళ్లు జోక్ చేసినా, నేను దాన్ని సీరియస్‌గా తీసుకున్నాను. ఆత్మహత్య చేసుకునే వాళ్లను ఆపగలిగితే అంతకంటే అదృష్టం ఏముంటుంది. మొదటి లాక్‌డౌన్‌లో చాలామంది సూసైడ్ చేసుకున్నారు. రెండో లాక్‌డౌన్‌లో మెంటల్ హెల్త్‌తో బాధపడే వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ప్రతిరోజు పదుల సంఖ్యలో కాల్స్ వస్తున్నాయి. అందుకే వీలైనంత త్వరగా వారికి సాయం చేయాలనుకున్నాను. దీనికంటే మంచి ఆలోచనలుండొచ్చు. కానీ నాకు తోచింది చేశాను. అందరి నుంచి అభినందనలు వస్తున్నాయి. ఇప్పటికే 7 లక్షల రూపాయలు విరాళాలుగా వచ్చాయి’ అని కెర్రీ తెలిపింది.