Xiaomi India: షియోమీ ఇండియా ప్రెసిడెంట్ బాధ్యతల నుంచి తప్పుకున్న మురళీకృష్ణన్
ఎగ్జిక్యూటివ్ పదవికి రాజీనామా చేసినప్పటికీ స్వతంత్ర సలహాదారుగా కొనసాగనున్నారు
దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ మొబైల్ బ్రాండ్ షావోమీ ఇండియా ప్రెసిడెంట్ మురళీకృష్ణన్ తన బాధ్యతలకు రాజీనామా చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించి మంగళవారం ప్రకటన విడుదల చేశారు. వ్యక్తిగత కారణాలతోనే ఆయన తన పదవి నుంచి వైదొలగుతున్నట్టు పేర్కొన్నారు. అయితే, ఎగ్జిక్యూటివ్ పదవికి రాజీనామా చేసినప్పటికీ స్వతంత్ర సలహాదారుగా కొనసాగనున్నారు. మొదటిసారిగా 2018లో షావోమీలో చేరిన మురళీకృష్ణన్ వివిధ బాధ్యతల్లో విధులు నిర్వహించారు. అనంతరం 2022లో షావోమీ ఇండియా ప్రెసిడెంట్‌గా ఎదిగారు. కంపెనీని సమర్థవంతంగా నిర్వహించడంలో ఆయన విజయవంతమయ్యారు. ఇటీవలే కంపెనీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా మోటోరొలా, లెనొవా మాజీ డైరెక్టర్ సుధిన్ మాథూర్‌ని షావోమీ నియమించిన సంగతి తెలిసిందే. ఇది జరిగిన రోజులవ్యవధిలోనే మురళీకృష్ణన్ రాజీనామా చేయడం గమనార్హం. అయితే, ఈ ఏడాది ఆఖరు వరకు మురళీకృష్ణన్ సంస్థలోనే కొనసాగుతారు.