ప్రాణాల మీదకు తెచ్చిన డేటింగ్
దిశ, వెబ్‌డెస్క్: స్మార్ట్‌ఫోన్ నిండుగా సోషల్ మీడియా యాప్‌లే ఉంటున్నాయి. అపరిచిత వ్యక్తులతో స్నేహాలు ఈ రోజుల్లో కామన్‌గా మారిపోయాయి. డేటింగ్’ యాప్‌ల వినియోగం కూడా పెరిగిపోయింది. సోషల్ మీడియా స్నేహాలు, డేటింగ్‌ల వల్ల జరుగుతున్న నేరాల గురించి వింటూనే ఉన్నాం. తాజాగా అమెరికాలోని అట్లాంటాకు చెందిన ఓ యువతి, డేటింగ్ యాప్‌లో పరిచయమైన ఓ కుర్రాడిని కలవడానికి వెళ్లింది. ఆ తర్వాత ఆమె చావు అంచుల దాకా వెళ్లి, సెక్యూరిటీ గార్డ్ సాయంతో బతికి బయటపడింది. […]
దిశ, వెబ్‌డెస్క్: స్మార్ట్‌ఫోన్ నిండుగా సోషల్ మీడియా యాప్‌లే ఉంటున్నాయి. అపరిచిత వ్యక్తులతో స్నేహాలు ఈ రోజుల్లో కామన్‌గా మారిపోయాయి. డేటింగ్’ యాప్‌ల వినియోగం కూడా పెరిగిపోయింది. సోషల్ మీడియా స్నేహాలు, డేటింగ్‌ల వల్ల జరుగుతున్న నేరాల గురించి వింటూనే ఉన్నాం. తాజాగా అమెరికాలోని అట్లాంటాకు చెందిన ఓ యువతి, డేటింగ్ యాప్‌లో పరిచయమైన ఓ కుర్రాడిని కలవడానికి వెళ్లింది. ఆ తర్వాత ఆమె చావు అంచుల దాకా వెళ్లి, సెక్యూరిటీ గార్డ్ సాయంతో బతికి బయటపడింది.
అట్లాంటాకు చెందిన బ్రిటనీ కొరెరీ, డేటింగ్ యాప్‌లో పరిచయమైన బెంజమిన్ ఫాంచెర్ అనే వ్యక్తితో తన ఫస్ట్ డేట్‌కు వెళ్లింది. బెంజమిన్ బాగానే రిసీవ్ చేసుకున్నాడు. తన స్నేహితులు, ఫ్యామిలీని కూడా పరిచయం చేశాడు. సాయంత్రం వరకు అంతా సవ్యంగానే సాగింది. ఇద్దరూ డిన్నర్ చేసి, కారులో తిరిగి వస్తున్న సమయంలో, ఉన్నట్లుండి బెంజమిన్ బ్రిటనీని కొట్టడం ప్రారంభించాడు. ‘నా తల, చెంపలు, గదవలు, పెదాలు, భుజాలు, గొంతు, ఇలా ఎక్కడ పడితే అక్కడే బలంగా కొడుతున్నాడు. ఒకానొక సమయంలో నన్ను చంపడానికి గన్ కూడా తీశాడు. ఇక ఆ క్షణం నేను చనిపోయాననే భావించాను. బెంజమిన్ తన బీఎమ్‌డబ్ల్యూ కారును ఆపి, దాంట్లోంచి నా జుట్టు పట్టుకుని బయటకు లాగాడు. నన్ను రోడ్డు మీద లాక్కెళ్లుతున్నాడు. బలంగా కొడుతున్నాడు. ఆ సమయంలోనే ఓ సెక్యూరిటీ గార్డ్ నన్ను చూశాడు. పరుగెత్తుకుంటూ వచ్చి ఫొటోలు తీశాడు, బెంజమిన్‌తో మాట్లాడి నన్ను విడిపించాడు’ అని కొర్రెరీ పోలీసులకు తెలిపింది.
బ్రిట్నీ తనకు ఎదురైన ఈ ఘటన గురించి తన ఇన్‌స్టాలో షేర్ చేసింది. ‘నేను ప్రశంసల కోసం ఈ పోస్ట్ చేయడం లేదు. ప్రతి మహిళ కూడా జాగ్రత్తగా ఉంటారని షేర్ చేస్తున్నాను. ఇలాంటి స్టోరీలు వింటుంటాం. కానీ, నిజంగా మనకు ఇలా జరుగుతుందని ఊహించం. అందుకే మహిళలు చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి. మీరు ఎక్కడికి వెళుతున్నారనే విషయాన్ని మీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు తప్పకుండా చెప్పండి. ఎవరితో వెళుతున్నారో కూడా చెప్పండి. మీకంటూ ఓ గేమ్ ప్లాన్ కూడా ఉండాలి’ అని బ్రిట్నీ సూచించింది. తన స్టోరీ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. ఎట్టకేలకు పోలీసులు బెంజమిన్‌ను పోలీసులు పట్టుకున్నారు. మెంటల్‌గా, ఫిజికల్‌గా స్ట్రాంగ్ కావడానికి తనకు కొద్ది సమయం పడుతుందని, ఆ తర్వాత అన్ని డేటింగ్ యాప్స్ మీద తగిన విధంగా యాక్షన్ తీసుకుంటానని,వాటి మీద పోరాటం చేస్తానని బ్రిట్రీ తెలిపింది.
https://www.instagram.com/p/CHiHArhgeIS/
ఇప్పటికే అపరిచిత వ్యక్తుల పరిచయాలను నమ్మి మోసపోయిన ఎందరో అమ్మాయిల, అబ్బాయిల ఇన్సిడెంట్స్ చూస్తేనే ఉన్నాం. ఈ ఘటనతో సోషల్ మీడియా పరిచయాలు అంతగా నమ్మడం కరెక్ట్ కాదనే విషయం మరోసారి రుజువు అయ్యింది. అమ్మాయిలు ఓ అపరిచిత వ్యక్తితో చాట్ చేయడం, వ్యక్తిగత సమాచారాన్ని వారికి చెప్పడం, ఫొటోలు, వీడియోలు సెండ్ చేయడం కరెక్ట్ కాదు. సోషల్ మీడియాలో మనం చేసే చిన్న మిస్టేక్ మన లైఫ్‌నే ప్రమాదంలో పడేయొచ్చు. మన లైఫ్‌ను నాశనం చేయొచ్చు. అందుకే నిత్యం అలర్ట్‌గా ఉండాలి.