పాక్ అనుకూల నినాదం చేసిన యువతిపై ‘దేశద్రోహం’

దిశ, వెబ్‌డెస్క్ : కర్ణాటకలోని బెంగళూర్‌లో సీఏఏ వ్యతిరేక కార్యక్రమంలో పాకిస్తాన్ జిందాబాద్ అని నినాదమిచ్చిన యువతిపై పోలీసులు ‘దేశద్రోహం’ ప్రయోగించారు. అదే కార్యక్రమంలో పాల్గొన్న హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఆమె వ్యాఖ్యలతో తమకు సంబంధం లేదని, శత్రుదేశమైన పాకిస్తాన్‌కు తాము ఎన్నడూ మద్దతునివ్వబోమని తెలిపారు. ‘రాజ్యాంగాన్ని రక్షించుకుందాం’ పేరిట నిర్వహించిన ఈ సభ చివరిలో అమూల్య స్టేజి పైకి చేరి పాకిస్తాన్ జిందాబాద్ అని పలికింది. ఏం మాట్లాడుతున్నావని ఆగ్రహంతో ప్రశ్నించగా.. పాకిస్తాన్ జిందాబాద్, […]

Update: 2020-02-21 00:41 GMT

దిశ, వెబ్‌డెస్క్ : కర్ణాటకలోని బెంగళూర్‌లో సీఏఏ వ్యతిరేక కార్యక్రమంలో పాకిస్తాన్ జిందాబాద్ అని నినాదమిచ్చిన యువతిపై పోలీసులు ‘దేశద్రోహం’ ప్రయోగించారు. అదే కార్యక్రమంలో పాల్గొన్న హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఆమె వ్యాఖ్యలతో తమకు సంబంధం లేదని, శత్రుదేశమైన పాకిస్తాన్‌కు తాము ఎన్నడూ మద్దతునివ్వబోమని తెలిపారు. ‘రాజ్యాంగాన్ని రక్షించుకుందాం’ పేరిట నిర్వహించిన ఈ సభ చివరిలో అమూల్య స్టేజి పైకి చేరి పాకిస్తాన్ జిందాబాద్ అని పలికింది. ఏం మాట్లాడుతున్నావని ఆగ్రహంతో ప్రశ్నించగా.. పాకిస్తాన్ జిందాబాద్, హిందుస్తాన్ జిందాబాద్ మధ్య తేడాను వివరించాలనుకుంటున్నానని చెప్పారు. వెంటనే ఆమె నుంచి మైక్ లాక్కుని పక్కకు తీసుకెళ్లారు. సభ ముగిశాక నిన్న(గురువారం) సాయంత్రం ఆమెను పోలీసులు అరెస్టు చేశారు. 124ఏ(సెడిషన్), 153ఏ,బీ(భిన్నవర్గాల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టటం, దేశ సమగ్రతకు భంగం కలిగించడం)లాంటి చట్టాల కింద సుమోటోగా కేసు నమోదు చేసినట్టు సీనియర్ పోలీసు అధికారి బి రమేష్ తెలిపారు. అమూల్యకు బెయిల్ నిరాకరించి 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీకి పంపించారు. స్థానిక కోర్టు సోమవారం ఆమె బెయిల్ పిటిషన్‌ను విచారించనుంది.

Tags:    

Similar News