మాస్క్ లేకుంటే రూ. 1000 జరిమానా.. సీఐ హెచ్చరిక
దిశ, అందోల్ : కరోనా కేసులు పెరుగుతుండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనవసరంగా ఇండ్లలో నుంచి బయటకు రాకూడదని జోగిపేట సీఐ శ్రీనివాస్ సూచించారు. ప్రభుత్వం మాస్క్‌లు ధరించకుండా రోడ్లపైకి వచ్చే వారికి రూ. 1000 జరిమానాను వేయాలని ప్రభుత్వం ఆదేశించడంతో బుధవారం సర్కిల్ పరిధిలోని జోగిపేట, పుల్కల్, వట్‌పల్లి మండలాల పరిధిలోని పోలీసులను ఉంచామన్నారు. మాస్క్ ధరించని వారికి మాస్క్‌లను అందజేశామని, ఇకనుంచి మాస్క్ను తప్పనిసరిగా ధరించాలని, అనవసరంగా బయటకు రాకూడదని, ఒకవేళ మాస్క్ లేకుండా […]
దిశ, అందోల్ : కరోనా కేసులు పెరుగుతుండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనవసరంగా ఇండ్లలో నుంచి బయటకు రాకూడదని జోగిపేట సీఐ శ్రీనివాస్ సూచించారు. ప్రభుత్వం మాస్క్‌లు ధరించకుండా రోడ్లపైకి వచ్చే వారికి రూ. 1000 జరిమానాను వేయాలని ప్రభుత్వం ఆదేశించడంతో బుధవారం సర్కిల్ పరిధిలోని జోగిపేట, పుల్కల్, వట్‌పల్లి మండలాల పరిధిలోని పోలీసులను ఉంచామన్నారు.
మాస్క్ ధరించని వారికి మాస్క్‌లను అందజేశామని, ఇకనుంచి మాస్క్ను తప్పనిసరిగా ధరించాలని, అనవసరంగా బయటకు రాకూడదని, ఒకవేళ మాస్క్ లేకుండా బయటకు వచ్చినట్లయితే రూ.వేయ్యి జరిమానాను విధిస్తామని హెచ్చరిస్తూన్నామని ఆయన తెలిపారు. ప్రజలు నిర్లక్ష్యం చేస్తే వారి ప్రాణాలకే ముప్పు వాటిల్లుతుందని, కరోనా జాగ్రత్తలను పాటించాలని ఆయన సూచించారు.