లక్షణాల్లేవు..కరోనా పాజిటివ్ వచ్చింది
దిశ, ఎల్బీనగర్: ఎలాంటి లక్షణాలు లేకుండానే హైదరాబాద్‌లోని హయత్ నగర్‌లో ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చింది. విషయం కాస్త బయటకు లీక్ అవ్వడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. వివరాల్లోకివెళితే..హయత్ నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని మన్సూరాబాద్ డివిజన్, లెక్చరర్స్ కాలనీలో నివాసముంటున్న 49ఏండ్ల ఓ వ్యక్తి నిమ్స్ ఆస్పత్రిలోని కార్డియాలజీ డిపార్ట్మెంట్లో ల్యాబ్ టెక్నిషన్‌గా పని చేస్తున్నాడు. గత 10 రోజులుగా అతను ఆస్పత్రిలోనే ఉంటూ విధులు నిర్వహిస్తున్నాడు. ఈనెల 5న హయత్ నగర్‌లోని లెక్చరర్స్ కాలనీలో […]
దిశ, ఎల్బీనగర్: ఎలాంటి లక్షణాలు లేకుండానే హైదరాబాద్‌లోని హయత్ నగర్‌లో ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చింది. విషయం కాస్త బయటకు లీక్ అవ్వడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. వివరాల్లోకివెళితే..హయత్ నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని మన్సూరాబాద్ డివిజన్, లెక్చరర్స్ కాలనీలో నివాసముంటున్న 49ఏండ్ల ఓ వ్యక్తి నిమ్స్ ఆస్పత్రిలోని కార్డియాలజీ డిపార్ట్మెంట్లో ల్యాబ్ టెక్నిషన్‌గా పని చేస్తున్నాడు. గత 10 రోజులుగా అతను ఆస్పత్రిలోనే ఉంటూ విధులు నిర్వహిస్తున్నాడు. ఈనెల 5న హయత్ నగర్‌లోని లెక్చరర్స్ కాలనీలో ఉన్న తన కుటుంబ సభ్యుల వద్దకు వెళుదామని అనుకుని కరోనా పరీక్షలు చేయించుకున్నాడు. ఎలాంటి లక్షణాలు లేకుండానే అతనికి కరోనా పాజిటివ్ నిర్దారణ అయ్యింది. దీంతో ఆస్పత్రి వర్గాలు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాయి. అనంతరం అతన్ని వెంటనే చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.