ప్రజలు ఇళ్లలో.. సింహాలు రోడ్లపై!

దిశ, వెబ్‌డెస్క్: కరోనా మానవాళికి తీవ్ర నష్టాన్ని చేకూర్చింది. కానీ.. ప్రకృతికి, పర్యావరణానికి ఎంతో లాభం చేసిందని పర్యావరణ ప్రేమికులు అభిప్రాయపడుతున్నారు. కానరాని పిట్టలు, కొన్ని సంవత్సరాలుగా వలసకు రాని అతిథి పక్షులు, కాలుష్యానికి కనిపించకుండా పోయిన పర్వతాలు.. ఇలా అన్ని ఇప్పుడు దర్శనమిస్తున్నాయి. మొన్నటికి మొన్న గజరాజు రోడ్లపై తిరిగింది. నిన్న తిరుమల వీధుల్లో ఎలుగుబంట్లు విహరించాయి. ఇప్పడు మృగరాజుల వంతు వచ్చినట్లుంది. ప్రజలంతా ఇళ్లలో ఉంటే.. సింహాలు రోడ్లపై హాయిగా సేదతీరుతున్నాయి. క్రుగర్ నేషనల్ […]

Update: 2020-04-18 04:58 GMT

దిశ, వెబ్‌డెస్క్: కరోనా మానవాళికి తీవ్ర నష్టాన్ని చేకూర్చింది. కానీ.. ప్రకృతికి, పర్యావరణానికి ఎంతో లాభం చేసిందని పర్యావరణ ప్రేమికులు అభిప్రాయపడుతున్నారు. కానరాని పిట్టలు, కొన్ని సంవత్సరాలుగా వలసకు రాని అతిథి పక్షులు, కాలుష్యానికి కనిపించకుండా పోయిన పర్వతాలు.. ఇలా అన్ని ఇప్పుడు దర్శనమిస్తున్నాయి. మొన్నటికి మొన్న గజరాజు రోడ్లపై తిరిగింది. నిన్న తిరుమల వీధుల్లో ఎలుగుబంట్లు విహరించాయి. ఇప్పడు మృగరాజుల వంతు వచ్చినట్లుంది. ప్రజలంతా ఇళ్లలో ఉంటే.. సింహాలు రోడ్లపై హాయిగా సేదతీరుతున్నాయి.

క్రుగర్ నేషనల్ పార్కు‌లో…

క్వారంటైన్ ప్రజలకు మాత్రమే తమకు కాదన్నట్లు స్వేచ్ఛగా తిరుగుతున్నాయి. దక్షిణాఫ్రికాలో క్రుగర్ నేషనల్ పార్కు‌లో సింహాలు రోడ్లపైనే పడకేసిన చిత్రాలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారాయి.

కరోనా మహమ్మారిని నియంత్రించడానికి ప్రపంచదేశాలన్నీ లాక్‌డౌన్ పాటిస్తున్నాయి. ఈ క్రమంలోనే సౌతాఫ్రికాలో కూడా లాక్‌డౌన్ కొనసాగుతోంది. దీంతో ఇక్కడి క్రుగర్ నేషనల్ పార్కును మార్చి 25 నుంచి మూసి వేశారు. దాంతో సందర్శకులెవరూ రావడంలేదు. ఈ క్రమంలో పొదల్లో హాయిగా సేదతీరే సింహాలు రోడ్లమీదకు వచ్చాయి. క్రుగర్ నేషనల్ పార్కు పులులకు, సింహాలకు ప్రసిద్ధి. ఈ పార్కులో సింహాలను దగ్గరి నుంచి చూసే వెసులుబాటు కూడా ఉంది. ఎక్కువగా వర్షకాలంలో రోడ్లపైకి వస్తుంటాయి. పార్కు క్యురేటర్ రోజుకోసారి వాటిని పరిశీలిస్తుంటాడు. అయితే పార్కులో అటుగా వెళ్తున్న క్యురేటర్‌కు సింహాలు రోడ్డుపై కనిపించడంతో వాటిని కెమెరాలో బంధించాడు. వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో… అవి వైరల్ అయ్యాయి. సాధారణంగా రాత్రి వేళల్లో పులులు, సింహాలు పొదల్లో నుంచి బయటకు వస్తాయని క్యురేటర్ తెలిపాడు. ఇదిలా ఉంటే.. దక్షిణాఫ్రికాలో 2506 మంది కోవిడ్-19 బారిన పడగా 34 మంది మరణించారు. దక్షిణాఫ్రికాలో మరో రెండు వారాలు లాక్ డౌన్‌ పొడిగించారు.

tags : lockdown, south africa, lions, road, kruger national park

Tags:    

Similar News