రెండు నెలల్లో 40 వేల మంది పిల్లలకు కరోనా..
బెంగళూరు : కరోనా సెకండ్ వేవ్ తర్వాత వచ్చే థర్డ్ వేవ్‌లో చిన్నపిల్లలకు ఎక్కువ ఇన్ఫెక్షన్ సోకే ముప్పు ఉందని నిపుణులు చెబుతున్నారు. కానీ, సెకండ్ వేవ్‌లోనే థర్డ్ వేవ్ బీజం వేసుకుంటున్నట్టు కర్ణాటక గణాంకాలు చూస్తుంటే తెలుస్తున్నది. కర్ణాటకలో కేవలం రెండు నెలల్లోనే సుమారు 40 వేల మంది 9ఏళ్లలోపు పిల్లలు కరోనాబారినపడ్డారు. 10 నుంచి 19ఏళ్ల పిల్లలు 1,05,044 మందికి పాజిటివ్ వచ్చినట్టు తేలింది. మనదేశంలోకి కరోనా ప్రవేశించినప్పటి నుంచి మార్చి 18 వరకు […]
బెంగళూరు : కరోనా సెకండ్ వేవ్ తర్వాత వచ్చే థర్డ్ వేవ్‌లో చిన్నపిల్లలకు ఎక్కువ ఇన్ఫెక్షన్ సోకే ముప్పు ఉందని నిపుణులు చెబుతున్నారు. కానీ, సెకండ్ వేవ్‌లోనే థర్డ్ వేవ్ బీజం వేసుకుంటున్నట్టు కర్ణాటక గణాంకాలు చూస్తుంటే తెలుస్తున్నది. కర్ణాటకలో కేవలం రెండు నెలల్లోనే సుమారు 40 వేల మంది 9ఏళ్లలోపు పిల్లలు కరోనాబారినపడ్డారు. 10 నుంచి 19ఏళ్ల పిల్లలు 1,05,044 మందికి పాజిటివ్ వచ్చినట్టు తేలింది. మనదేశంలోకి కరోనా ప్రవేశించినప్పటి నుంచి మార్చి 18 వరకు నమోదైన కేసుల కంటే మార్చి 18 నుంచి మే 18 వరకు నమోదైనవే ఎక్కువగా ఉండటం కలవరపెట్టే అంశం.
ఈ ఏడాది మార్చి 18 వరకు 9ఏళ్లలోపున్న 27,841 మంది పిల్లలకు కరోనా వచ్చింది. కానీ, తర్వాతి రెండు నెలల్లోనే 39,846 మంది పిల్లలకు కరోనా సోకింది. కాగా, కౌమార దశలోని పిల్లలకూ ఇన్ఫెక్షన్ కేసులు పెరుగుతున్నాయి. ఈ ఏడాది మార్చి 18 వరకు 10 నుంచి 19ఏళ్ల పిల్లల్లో 65,551 కేసులు నమోదవ్వగా, తర్వాతి రెండు నెలల్లో 1.05 లక్షల కేసులు రిపోర్ట్ అయ్యాయి. కేసులే కాదు, మరణాలూ ఎక్కువగానే ఉన్నాయి. మార్చి 18 వరకు 9ఏళ్లలోపు పిల్లలు కరోనాతో 28 మంది చనిపోగా, తర్వాతి రెండు నెలల్లోనే 15 మంది మరణించారు. అంటే, సెకండ్ వేవ్ సమయంలో ఈ ఏజ్ గ్రూప్ పిల్లలో మరణాలు మూడు రెట్లు పెరిగాయి. 10 నుంచి 19ఏళ్ల పిల్లల్లోనూ ఇదే కాలంలో 46 నుంచి 62గా మరణాలున్నాయి.