ప్రేక్షకుల సంఖ్యలో కోత విధించనున్న వింబుల్డన్

దిశ, స్పోర్ట్స్ : కరోనా మహమ్మారి కారణంగా గత ఏడాది వింబుల్డన్‌ను ఆల్ ఇంగ్లాండ్ క్లబ్ రద్దు చేసింది. 1945 తర్వాత వింబుల్డన్ రద్దు కావడం ఇదే తొలి సారి. అయితే ఈ ఏడాది ఈ ప్రతిష్టాత్మక గ్రాండ్ స్లామ్‌ను జూన్ 28 నుంచి జులై 11 వరకు నిర్వహించనున్నట్లు వింబుల్డన్ యాజమాన్యం తెలిపింది. కాగా, బ్రిటన్‌లో కరోనా కొత్త స్ట్రెయిన్ ప్రారంభం కావడంతో ఈ సారి ప్రేక్షకుల సంఖ్యలో భారీ కోత విధించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. […]

Update: 2021-02-05 08:15 GMT

దిశ, స్పోర్ట్స్ : కరోనా మహమ్మారి కారణంగా గత ఏడాది వింబుల్డన్‌ను ఆల్ ఇంగ్లాండ్ క్లబ్ రద్దు చేసింది. 1945 తర్వాత వింబుల్డన్ రద్దు కావడం ఇదే తొలి సారి. అయితే ఈ ఏడాది ఈ ప్రతిష్టాత్మక గ్రాండ్ స్లామ్‌ను జూన్ 28 నుంచి జులై 11 వరకు నిర్వహించనున్నట్లు వింబుల్డన్ యాజమాన్యం తెలిపింది. కాగా, బ్రిటన్‌లో కరోనా కొత్త స్ట్రెయిన్ ప్రారంభం కావడంతో ఈ సారి ప్రేక్షకుల సంఖ్యలో భారీ కోత విధించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ‘మా ముందు మూడు అవకాశాలు ఉన్నాయి. పూర్తి స్థాయి ప్రేక్షకులతో నిర్వహించడం, ప్రేక్షకుల సంఖ్య తగ్గించి నిర్వహించడం, అసలు ప్రేక్షకులనే అనుమతించకపోవడం. క్లబ్‌లో మెజార్టీ సభ్యులు మాత్రం ప్రేక్షకులను తగ్గించి అనుమతించాలని అంటున్నారు. అయితే ఇంకా సమయం ఉన్నందున తుది నిర్ణయానికి రాలేకపోతున్నాం’ అని ఆల్ ఇంగ్లాండ్ క్లబ్ ఒక ప్రకటన విడుదల చేసింది. ఇంగ్లాండ్‌లో వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా జరుగుతుండటంతో అక్కడి ప్రభుత్వం సమావేశాలు, సభలు, ఈవెంట్లకు అనుమతులు మంజూరు చేస్తున్నది. ఈ నేపథ్యంలోనే వింబుల్డన్ తేదీలను క్లబ్ ప్రకటించింది.

Tags:    

Similar News