షెడ్యూల్ ప్రకారమే ‘వింబుల్డన్’
టెన్నిస్ గ్రాండ్‌స్లామ్ ఈవెంట్లలో ఒకటైన వింబుల్డన్ షెడ్యూల్ ప్రకారమే జరుగుతుందని నిర్వాహకులైన ఆల్ ఇంగ్లాండ్ లాన్ టెన్నిస్ క్లబ్ ప్రకటించింది. జూన్ 29 నుంచి జులై 12 వరకు వింబుల్డన్ టోర్నీ లండన్‌లో జరగనుంది. కాగా, ఇంగ్లాండ్‌లో కరోనా వైరస్ తీవ్రత అప్పటి వరకు తగ్గుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గ్రాస్ కోర్ట్ టోర్నమెంట్ అయిన వింబుల్డన్ నిర్వహణ కోసం ఇప్పటికే అన్ని రకాల ఏర్పాట్లు పూర్తయ్యాయని ఆల్ ఇంగ్లాండ్ లాన్ టెన్నిస్ క్లబ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ […]
టెన్నిస్ గ్రాండ్‌స్లామ్ ఈవెంట్లలో ఒకటైన వింబుల్డన్ షెడ్యూల్ ప్రకారమే జరుగుతుందని నిర్వాహకులైన ఆల్ ఇంగ్లాండ్ లాన్ టెన్నిస్ క్లబ్ ప్రకటించింది. జూన్ 29 నుంచి జులై 12 వరకు వింబుల్డన్ టోర్నీ లండన్‌లో జరగనుంది. కాగా, ఇంగ్లాండ్‌లో కరోనా వైరస్ తీవ్రత అప్పటి వరకు తగ్గుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గ్రాస్ కోర్ట్ టోర్నమెంట్ అయిన వింబుల్డన్ నిర్వహణ కోసం ఇప్పటికే అన్ని రకాల ఏర్పాట్లు పూర్తయ్యాయని ఆల్ ఇంగ్లాండ్ లాన్ టెన్నిస్ క్లబ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ రిచర్డ్ లూయిస్ తెలిపారు.
‘క్రీడాకారులు, సిబ్బంది, సభ్యులు, ప్రజల’ ఆరోగ్యాలే మాకు ముఖ్యం.. ఇందుకు ప్రభుత్వ వర్గాల సలహాలు, సహాయాలు తీసుకుంటూనే ఉన్నామన్నారు. కానీ వైరస్ ప్రభావం పెరిగితే మాత్రం తమ నిర్ణయాన్ని పునఃపరిశీలిస్తామని నిర్వాహకులు తెలిపారు. మరోవైపు ఫ్రెంచ్ ఓపెన్‌ను వెనక్కు జరిపారు. షెడ్యూల్ ప్రకారం మే 24 నుంచి ఈ గ్రాండ్ స్లామ్ ఈవెంట్ ప్రారంభం కావల్సి ఉంది. కానీ ఇప్పుడు దీన్ని సెప్టెంబర్ 20 నుంచి అక్టోబర్ 4 వరకు నిర్వహించనున్నట్లు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. రోలాండ్ గారోస్ సెంటర్ కోర్టుకు కప్పు బిగించే పనులు జరుగుతున్నాయి. అలాగే ఫిలిప్ చాట్రియర్‌తో పాటు మరో మూడు మెయిన్ కోర్టులకు ఫ్లడ్ లైట్లు అమర్చే పనులు జరుగుతున్నాయి. అందుకే షెడ్యూల్‌లో మార్పు జరిగినట్లు నిర్వాహకులు తెలిపారు.
Tags: Wimbledon, Tennis Grand slam, Schedule, England Lawn tennis club, French Open