రాజీనామా చేస్తే అండగా ఉంటారా.?

దిశ, హుజురాబాద్: పొద్దంతా అందరిని కలుస్తూ వారి అభిప్రాయాలు వింటున్న మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాత్రి వేళల్లో కీలక సమావేశాలు నిర్వహిస్తున్నారు. సెక్టార్ల వారిగా విభజించుకున్న ఈటల రాజేందర్ మంగళవారం రాత్రి హుజురాబాద్ సర్పంచ్‌లతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఈటల వారితో మాట్లాడుతూ… తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే అండగా ఉంటారా లేదా అని అడిగారు. మీపై ఒత్తిళ్లు వచ్చి మద్దతు ఇచ్చే పరిస్థితి ఉన్నా క్లారిటీగా చెప్పండి అంటూ సర్పంచ్ […]

Update: 2021-05-04 21:44 GMT

దిశ, హుజురాబాద్: పొద్దంతా అందరిని కలుస్తూ వారి అభిప్రాయాలు వింటున్న మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాత్రి వేళల్లో కీలక సమావేశాలు నిర్వహిస్తున్నారు. సెక్టార్ల వారిగా విభజించుకున్న ఈటల రాజేందర్ మంగళవారం రాత్రి హుజురాబాద్ సర్పంచ్‌లతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఈటల వారితో మాట్లాడుతూ… తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే అండగా ఉంటారా లేదా అని అడిగారు.

మీపై ఒత్తిళ్లు వచ్చి మద్దతు ఇచ్చే పరిస్థితి ఉన్నా క్లారిటీగా చెప్పండి అంటూ సర్పంచ్ లును అడిగారు. అధికారంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం వల్ల ఎన్నో రకాల ఒత్తిళ్లు వచ్చే అవకాశం ఉన్నందున ముఖ స్థుతి లేకుండా మాట్లాడండి అని వారిని అడిగారు. అయితే సర్పంచులు మాత్రం మీ వెన్నంటే ఉంటామని స్పష్టం చేసినట్టుగా సమాచారం. స్థానికంగా అన్నింటా అండగా నిలిచిన మీ గెలుపు కోసమే కృషి చేస్తామని వారు స్పష్టం చేసినట్టు సమాచారం.

Tags:    

Similar News