బిగ్‌బాస్‌లో బిగ్ ట్విస్ట్.. అప్పుడు సొహైల్.. ఇప్పుడు సిరి.. మరి ఫ్యాన్స్ రెస్పాన్స్..?

దిశ, వెబ్‌డెస్క్: బిగ్ బాస్ ఈ పేరుకు పరిచయం అక్కర్లేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యదికంగా చూసే బుల్లితెర ప్రోగ్రాముల్లో ఇది టాప్‌లో ఉంటుంది. లక్ ట్రాక్స్, ఫన్నీ గేమ్స్, ఊహకు అందని మలుపులతో బిగ్ బాస్ రసవత్తరంగా నడుస్తుంటుంది. ఏ సీజన్‌కి ఆ సీజన్ అత్యంత ఉత్కంఠగా సాగుతుంది. అలాగే చివరికి విన్నర్ విషయంలోనూ టెన్షన్ పుట్టిస్తోంది. అదే తరహాలో సీజన్ 4 లో ఏ ప్రేక్షకుడు ఊహించని విధంగా విన్నర్ ప్రైజ్ మనీని బిగ్‌బాస్ […]

Update: 2021-12-19 00:08 GMT

దిశ, వెబ్‌డెస్క్: బిగ్ బాస్ ఈ పేరుకు పరిచయం అక్కర్లేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యదికంగా చూసే బుల్లితెర ప్రోగ్రాముల్లో ఇది టాప్‌లో ఉంటుంది. లక్ ట్రాక్స్, ఫన్నీ గేమ్స్, ఊహకు అందని మలుపులతో బిగ్ బాస్ రసవత్తరంగా నడుస్తుంటుంది. ఏ సీజన్‌కి ఆ సీజన్ అత్యంత ఉత్కంఠగా సాగుతుంది. అలాగే చివరికి విన్నర్ విషయంలోనూ టెన్షన్ పుట్టిస్తోంది. అదే తరహాలో సీజన్ 4 లో ఏ ప్రేక్షకుడు ఊహించని విధంగా విన్నర్ ప్రైజ్ మనీని బిగ్‌బాస్ ఇచ్చాడు. మూడో స్థానంలో వచ్చిన సోహైల్ రూ.25 లక్షలు తీసుకొని గేమ్ నుంచి తప్పుకున్నాడు. దాంతో ఆ సీజన్‌లో విన్ అయిన అబిజిత్‌కి సోహైల్‌కి స్థానాల్లో తేడా ఉన్నా, ప్రైజ్ మనీ మాత్రం ఒకటే.

దీంతో ప్రస్తుతం జరుగుతున్న బిగ్‌బాస్ 5 సీజన్‌లోనూ ఇదే సీన్ రిపీట్ అవుతుందా అని ప్రేక్షకులు భావిస్తున్నారు. ఈ సీజన్‌లో ఫైనల్స్‌కు సన్నీ, షణ్ముఖ్, శ్రీరామ్, మానస్, సిరి చేరుకున్నారు. వీరికి కూడా మొదట రూ.10 లక్షలతో ప్రారంభించి లెక్కలు సెటిల్ చేయవచ్చు. అయితే సిరి మొదటి నుంచి కూడా టైటిల్‌పై తనకు నమ్మకం లేదని, షణ్ముఖ్ గెలుస్తాడని చెప్పుకొస్తోంది. కాబట్టి ఈ సీజన్‌లో సిరి రూ.25 లక్షలకి టెంప్ట్ అయ్యి తప్పుకోవచ్చని ప్రేక్షకులు భావిస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Tags:    

Similar News