గొర్రెలివ్వకపోతే ప్రగతిభవన్ ముట్టడి
దిశ, న్యూస్‌బ్యూరో: రెండో విడత గొర్రెల పంపిణీ చేపట్టకపోతే ప్రగతిభవన్‌ను ముట్టడిస్తామని తెలంగాణ గొర్రెలు, మేకల పెంపకందారుల సంఘం(జీఎంపీఎస్) ప్రతినిధులు హెచ్చరించారు. హైదరాబాద్‌లో జీఎంపీఎస్ ప్రతినిధులు సామూహిక నిరసన దీక్షకు దిగారు. పశుసంవర్థక శాఖ డైరెక్టర్ కార్యాలయం వైపు ర్యాలీగా వెళ్తున్న జీఎంపీఎస్ ప్రతినిధులను అరెస్టు చేసిన పోలీసులు గోషామహల్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న గొల్ల కురుమలందరికీ రెండేళ్లలో గొర్రెలు పంపిణీ చేస్తామని చెప్పి మొండిచెయ్యి చూపించిందని జీఎంపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి […]
దిశ, న్యూస్‌బ్యూరో: రెండో విడత గొర్రెల పంపిణీ చేపట్టకపోతే ప్రగతిభవన్‌ను ముట్టడిస్తామని తెలంగాణ గొర్రెలు, మేకల పెంపకందారుల సంఘం(జీఎంపీఎస్) ప్రతినిధులు హెచ్చరించారు. హైదరాబాద్‌లో జీఎంపీఎస్ ప్రతినిధులు సామూహిక నిరసన దీక్షకు దిగారు. పశుసంవర్థక శాఖ డైరెక్టర్ కార్యాలయం వైపు ర్యాలీగా వెళ్తున్న జీఎంపీఎస్ ప్రతినిధులను అరెస్టు చేసిన పోలీసులు గోషామహల్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న గొల్ల కురుమలందరికీ రెండేళ్లలో గొర్రెలు పంపిణీ చేస్తామని చెప్పి మొండిచెయ్యి చూపించిందని జీఎంపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉడుత రవీందర్ విమర్శించారు. గొర్రెలివ్వాలని శాంతియుతంగా ఆందోళన చేస్తున్న తమపై పోలీసులను ప్రయోగించడం దారుణమని అన్నారు. రాష్ట్రంలో మొత్తం 7లక్షల 29వేల మందిని లబ్ధిదారులుగా ఎంపిక చేసి ఇందులో.. కేవలం 3 లక్షల 63వేల మందికి మాత్రమే గొర్రెలు పంపిణీ చేశారన్నారు. గత ఏడాది గొర్రెల పంపిణీ డిమాండ్‌తో ఛలో అసెంబ్లీకి కార్యక్రమం చేపట్టిన సందర్భంగా మంత్రి తలసాని తమకు గొర్రెలిస్తామని మాట ఇచ్చి నిలుపుకోలేదని గుర్తుచేశారు.
tags : gmps, pragathi bhavan, group protest, sheep and goats