వికీపీడియాకు కొత్త రూపం

దిశ, వెబ్‌డెస్క్: ఏదైనా విషయం గురించి పూర్తిస్థాయి సమాచారం కావాల్సినపుడు ఇంటర్నెట్ ఓపెన్ చేసి చూసే మొదటి వెబ్‌సైట్ వికీపీడియా. ఆ వెబ్‌సైట్ గురించి తలుచుకోగానే అక్షరాల పజిల్ ముక్కలతో పూర్తిగా చేయని గ్లోబ్ ఆకృతి గుర్తొస్తుంది. ఆ పక్కనే సెర్చ్ చేసిన టాపిక్ పేరు, దానికి సంబంధించిన విషయాల పట్టిక కనిపిస్తుంది. గత పదేళ్ల నుంచి వికీపీడియా ఇలాగే ఉంది. వెబ్‌సైట్ డిజైన్‌లో ఎలాంటి మార్పు లేదు. కానీ ఇప్పుడు పాత డిజైన్‌కు కాలం చెల్లిపోయింది. […]

Update: 2020-09-24 04:53 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఏదైనా విషయం గురించి పూర్తిస్థాయి సమాచారం కావాల్సినపుడు ఇంటర్నెట్ ఓపెన్ చేసి చూసే మొదటి వెబ్‌సైట్ వికీపీడియా. ఆ వెబ్‌సైట్ గురించి తలుచుకోగానే అక్షరాల పజిల్ ముక్కలతో పూర్తిగా చేయని గ్లోబ్ ఆకృతి గుర్తొస్తుంది. ఆ పక్కనే సెర్చ్ చేసిన టాపిక్ పేరు, దానికి సంబంధించిన విషయాల పట్టిక కనిపిస్తుంది. గత పదేళ్ల నుంచి వికీపీడియా ఇలాగే ఉంది. వెబ్‌సైట్ డిజైన్‌లో ఎలాంటి మార్పు లేదు. కానీ ఇప్పుడు పాత డిజైన్‌కు కాలం చెల్లిపోయింది. అలాగని భారీ ఎత్తున మార్పులు తీసుకొస్తున్నారని అనుకోవద్దు. యూజర్‌కు ఇబ్బంది కలిగిస్తున్న కొన్ని సదుపాయాలను మాత్రమే ఈ కొత్త డిజైన్‌లో మెరుగుపరచబోతున్నారు.

మాటిమాటికి వెబ్‌సైట్ డిజైన్ మార్చి, యూజర్లను ఇబ్బంది పెట్టడం వికీపీడియాకు ఇష్టం ఉండదు. డిజైన్‌లో ఎంత నిలకడగా ఉంటే, సమాచారాన్ని అంత కచ్చితత్వంతో అందజేస్తున్నారనే అభిప్రాయాన్ని యూజర్లలో కలిగేలా చేయడానికే వికీపీడియా గత పదేళ్ల నుంచి డిజైన్ మార్చలేదు. ఇప్పుడు కూడా యూజర్ల స్క్రాలింగ్ ఇబ్బందిని తగ్గించడానికి విషయాల పట్టిక స్థానాన్ని మార్చడం, లోగోను కొద్దిగా త్రీడీలో చేయడం వంటి చిన్న చిన్న మార్పులను చేస్తున్నారు. అది కూడా డెస్క్‌టాప్ వెర్షన్‌కు మాత్రమే ఈ మార్పులు చేస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో ఏదైనా టాపిక్ గురించి సంబంధిత విషయం వద్దకు వెళ్లాలంటే ప్రతిసారీ విషయాల పట్టిక దగ్గరికి స్క్రాల్ చేయాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ అవసరం లేకుండా పేజీలో ఏ స్థానంలో ఉన్నా, కుడివైపున విషయాల పట్టిక ఉండేలా రెస్పాన్సివ్‌గా పేజీని డిజైన్ చేశారు.

Tags:    

Similar News